జీహెచ్ఎంసీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్: ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథి

Published : Oct 07, 2020, 12:16 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్: ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథి

సారాంశం

 జీహెచ్ఎంసీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి చెప్పారు.బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్  పార్థసారథి తిరుమల వెంకటేశ్వరస్వామిని ఆయన దర్శించుకొన్నారు.


తిరుమల: జీహెచ్ఎంసీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి చెప్పారు.బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్  పార్థసారథి తిరుమల వెంకటేశ్వరస్వామిని ఆయన దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

also read:బ్యాలెట్ పద్దతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఎస్ఈసీ మొగ్గు?

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు.ఈ ఎన్నికలపై పలు రాజకీయ పార్టీలతో పార్ధసారథి సమావేశం నిర్వహించారు. ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలా అనే అంశంపై చర్చించారు.

బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని మెజారిటీ పార్టీలు అభిప్రాయపడినట్టుగా సమాచారం. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం పూర్తి కానుంది. దీంతో జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించనున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్