ముగిసిన జీహెచ్ఎంసీ కార్పోరేటర్ల ప్రమాణస్వీకారం: సామూహిక ప్రమాణం

By narsimha lodeFirst Published Feb 11, 2021, 11:19 AM IST
Highlights

 జీహెచ్ఎంసీ కార్పోరేటర్ల ప్రమాణస్వీకారోత్సవం గురువారం నాడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రారంభమైంది. కార్పోరేటర్ల ప్రమాణస్వీకారోత్సవం ముగిసిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎన్నుకొంటారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్పోరేటర్ల ప్రమాణస్వీకారోత్సవం గురువారం నాడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రారంభమైంది. కార్పోరేటర్ల ప్రమాణస్వీకారోత్సవం ముగిసిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎన్నుకొంటారు.

ఎన్నికల సంఘం నియమించిన కలెక్టర్ శ్వేతా మహంతి కార్పోరేటర్లతో ప్రమాణస్వీకారం చేయించారు.  తెలుగులో ప్రమాణం చేసే కార్పోరేటర్లు గ్రూపుగా ఒకేసారి ప్రమాణం చేశారు.
ఆ తర్వాత ఉర్దూలో కార్పోరేటర్లు ప్రమాణం చేశారు. 
 

also read:పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటేయాలి: టీఆర్ఎస్ కార్పోరేటర్ల సమావేశంలో కేటీఆర్

హిందీలో కొందరు కార్పోరేటర్లు ప్రమాణం చేశారు. హిందీలో ప్రమాణం పూర్తైన తర్వాత చివరగా ఇంగ్లీష్ లో కొందరు కార్పో,రేటర్లు ప్రమాణం చేశారు. కార్పోరేటర్ల ప్రమాణస్వీకారానికి సంబంధించిన ప్రక్రియను శ్వేత మహంతి వివరించారు. అయితే గ్రూప్ గా ప్రమాణం చేయించాలని కొందరు సభ్యులు సూచించారు.ఈ సూచనతో అన్ని పార్టీలకు చెందిన సభ్యులు సమ్మతించారు. దీంతో ఒకే భాషలో కార్పోరేటర్లు గ్రూపుగా ఒకేసారి ప్రమాణం చేశారు.

టీఆర్ఎస్ కార్పోరేటర్లు గులాబీ కండువాలు ధరించి సమావేశానికి హాజరయ్యారు. బీజేపీకి చెందిన కార్పోరేటర్లు కాషాయ తలపాగాలు ధరించి సమావేశానికి వచ్చారు.మొత్తం 149 మంది కార్పోరేటర్లు ప్రమాణం చేశారు. 
 

click me!