సిర్పూర్ పేపర్ మిల్లులో గ్యాస్ లీక్: భయాందోళనలో కార్మికులు

By narsimha lode  |  First Published May 11, 2020, 11:52 AM IST

 కాగజ్‌నగర్:కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్  నగర్ పేపర్ మిల్లులో సోమవారం నాడు గ్యాస్ లీకైంది.ఈ ఘటనలో ఓ కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు.


సిర్పూర్ కాగజ్‌నగర్:కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్  నగర్ పేపర్ మిల్లులో సోమవారం నాడు గ్యాస్ లీకైంది.ఈ ఘటనలో ఓ కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు.

సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లులో తిరిగి పనులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైనట్టుగా గుర్తించారు.ఈ గ్యాస్ లీక్ కావడంతో ఓ కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ సమయంలో ఫ్యాక్టరీలో 20 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

Latest Videos

గ్యాస్ లీకేజీకి కారణాలు ఏమిటనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ లీకేజీ వల్ల ఏమైనా నష్టం వాటిల్లిందా అనే కోణంలో కూడ అధికారులు విచారణ చేస్తున్నారు. 

ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్టణంలోని గోపాలపురంలో ఉన్న ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో స్టైరిన్ గ్యాస్ లీకైంది.ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లులో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ ఫ్యాక్టరీలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. 

click me!