హైదరాబాద్ లోని డిఆర్డివో సంస్థ, డిఫెన్సె రీసెర్చ్ అల్ట్రావైలెట్ శానిటైజర్ పేరుతో ఒక పరికరాన్ని రూపొందించింది. ఇందులో చెక్కులు, బ్యాంకు డీడీలు, డబ్బులు, మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు అన్నిటిని శానిటైజ్ చేయవచ్చు.
కరోనా వైరస్ వేళ అన్నిటిని శానిటైజ్ చేయడమనేది ఆవశ్యకంగా మారింది. మన చేతుల నుంచి మొదలు ఆఫీస్ పరిసరాల వరకు అన్నిటిని ఈ వైరస్ ఫ్రీ గా ఉంచుకోవాలని చూస్తున్నాము. మన చేతులను, ఆఫీస్ పరిసరాలను ఓకే, మరి మన ఫోన్లు, లాప్ టాప్ ల సంగతి...? వాటి పరిస్థితి ఏమిటి?
ఈ ఆలోచనతోనే ముందుకొచ్చింది హైదరాబాద్ లోని డిఆర్డివో సంస్థ. డిఫెన్సె రీసెర్చ్ అల్ట్రావైలెట్ శానిటైజర్ పేరుతో ఒక పరికరాన్ని రూపొందించింది. ఇందులో చెక్కులు, బ్యాంకు డీడీలు, డబ్బులు, మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు అన్నిటిని శానిటైజ్ చేయవచ్చు.
undefined
ఇందులో ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే.... మనం దీన్ని తాకవలిసిన అవసరం కూడా లేదు. ఇది పూర్తిగా కాంటాక్ట్ లెస్. ఎవరూ కూడా దీన్ని ముట్టుకోవాలిసిన అవసరం లేదు. సెన్సెర్ సహాయంతో దీని దగ్గరగా మనం లోపల శానిటైజ్ చేయాలనుకున్న వస్తువును తీసుకెళ్లినప్పుడు అది తెరుచుకుంటుంది. శానిటైజ్ చేయడం అయిపోయాక మరల ఓపెన్ అవుతుంది. మన పని పూర్తి అయ్యాక ఇది స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది.
ఇలా కాంటాక్ట్ లెస్ గా ఉండడం వల్ల ఈ పరికరాన్ని ఎవరన్నా తాకడం, దాని మీద కరోనా వైరస్ ఉందేమో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ కరోనా కష్టకాలంలో ఈ పరికరం వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుందని డిఆర్డిఓ వర్గాలు అంటున్నాయి.
ఇది ఇలా ఉండగా.... భారతదేశంలో కోరనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 4213 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 67,152కు చేరుకుంది.
భారతదేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య కూడా ఆగడం లేదు. కొత్తగా గత 24 గంటల్లో 97 మరణాలు రికార్డయ్యాయి. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2,206కు చేరుకుంది.
కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఒక్క రోజులో 4 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత కొద్ది రోజులుగా ప్రతి రోజు 3 వేలకు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అది కాస్తా 4 వేలు దాటింది.
దేశంలో యాక్టివ్ కేసులు 44,029 ఉన్నాయి. ఇప్పటి వరకు 20,916 చికిత్స పొంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు రికవరీ రేటు 31.15 శాతం ఉంది.
ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. దేశంలో మూడో విడత లాక్ డౌన్ ఈ నెల 17వ తేదీన ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో మోడీ మాట్లాడుతున్నారు.