గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్ కి ఇవాళ ప్రమాదం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో వంశీ కాన్వాయ్ లోని వాహనాలు ఢీకొన్నాయి.
సూర్యాపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో శనివారంనాడు తృటిలో ప్రమాదం తప్పింది.సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్ కి ప్రమాదం చోటు చేసుకుంది. వంశీ కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఎమ్మెల్యే వంశీ సహా కాన్వాయ్ లోని వారంతా సురక్షితంగా ఉన్నారు.
ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కాన్వాయ్ లోని ఇతర వాహనాలను తీసుకొని ఎమ్మెల్యే వంశీ హైద్రాబాద్ వెళ్లిపోయారు.ఇవాళ ఉదయం విజయవాడ నుండి వల్లభనేని వంశీ హైద్రాబాద్ కు బయలుదేరారు. అయితే చివ్వెంల మండలం ఖాసీంపేట వద్దకు చేరుకోగానే వంశీ కాన్వాయ్ లోని వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం నుండి వంశీ సహా కాన్వాయ్ లోని వారంతా సురక్షితంగా బయట పడ్డారు.
undefined
2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీకి జై కొట్టారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా ఆయన పోటీ చేయనున్నారు. గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా పోీ చేసిన యార్లగడ్డ వెంకటరావు నిన్న వైఎస్ఆర్‌సీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబును అపాయింట్ మెంట్ కోరారు.
also read:గన్నవరం రాజకీయం : ప్రత్యర్థులు వాళ్లే, కానీ పార్టీలే వేరు
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జీగా ఉన్న బచ్చుల అర్జునుడు ఇటీవలనే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో గన్నవరం అసెంబ్లీ స్థానానికి ఇంచార్జీని నియమించాల్సి ఉంది.ఈ తరుణంలో యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. మీడియా సమక్షంలోనే చంద్రబాబును అపాయింట్ మెంట్ కోరారు యార్లగడ్డ వెంకటరావు.