కిషన్ రెడ్డిపై గంగుల ఫైర్.. నిజాల్ని వక్రీకరించేలా అబద్దాలు చెబుతున్నాడంటూ మండిపాటు..

Published : Mar 26, 2022, 01:19 PM IST
కిషన్ రెడ్డిపై గంగుల ఫైర్.. నిజాల్ని వక్రీకరించేలా అబద్దాలు చెబుతున్నాడంటూ మండిపాటు..

సారాంశం

ఈ దేశంలో పండిన పంటలు కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. వేలుకేస్తే కాలుకు, కాలుకేస్తే వేలుకేస్తున్నారు. రా రైస్ , బాయిల్డ్ రైస్ పేరుతో కేంద్రం లేకి రాజకీయాలు చేస్తుంది. బీజేపీ నేత రైతులను మీరు వడ్లు వేయండి. కేంద్రంతో కొనిపించే బాధ్యత నాది అంటడు. కేసీఆర్ కు ఏ సంబంధం అంటాడు. కేంద్రమంత్రి మేం తెలంగాణ వడ్లు కొనం అంటాడు.. అంటూ గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ : ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అవమాన పూరిత, నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్,  వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ లు టిఆర్ఎస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ కాదా? తెలంగాణ ప్రజలకు, రైతులకు అన్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వానికి వంత పాడడం అనైతికం అంటూ మండిపడ్డారు.

"

నిజాల్ని వక్రీకరించేలా కేంద్ర మంత్రి హోదాలో అబద్దాలు చెప్పడం హేయం అని దుయ్యబట్టారు. ఒప్పందం చేసిన పరిస్థితులపై కొట్లాడాల్సిన బాధ్యత కిషన్రెడ్డికి లేదా? రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల కేరళకు, 12 వేల మెట్రిక్ టన్నుల కర్ణాటకకు, 60 లక్షల మెట్రిక్ టన్నుల తెలంగాణకు ఒకే సీఎంఆర్ గడువు ఎలా సమంజసం? అని ప్రశ్నించారు. ప్రతి నెల 10 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తామన్నా 16లేఖలు రాసినా... రాకులు లేవని గోదాములు ఖాళీ లేవని తీసుకొనిది కేంద్రమే అన్నారు. ఏప్రిల్ రెండో తారీకు లోగా తెలంగాణ దాన్యం సేకరిస్తామని కేంద్రం ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

నూకలు తినిపించాలంటూ...
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై అవమానకరంగా వ్యవహరిస్తోందన్నారు, ధాన్యం సేకరణ అంశాలపై కేంద్ర మంత్రిని ఐదుసార్లు రాష్ట్ర మంత్రుల బృందమే కలిసిందని, ప్రతిసారీ అవహేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడారని దుయ్యబట్టారు. అయినా తెలంగాణ రైతాంగం కోసం వాటన్నింటిని భరించి మొన్నటి రోజున కలిశామని ఈసారి వారి తీరు పరాకాష్టకు చేరుకుంది అన్నారు. తెలంగాణ ధాన్యాన్ని సేకరించాలేమని చెబుతూ, తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించే అలవాటు చేయాలని మాట్లాడారన్నారు. ఈ మాటల్ని ఖండించాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ కాదా అని ప్రశ్నించారు మంత్రి గంగుల కమలాకర్.

కిషన్ రెడ్డి మళ్లీ అదే పాత పాట పాడుతున్నారని, తెలంగాణ బిడ్డ అయి ఉండి ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో కిషన్రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి హోదాలో తెలంగాణపై అసత్యాలు ప్రచారం చేయడం అబద్దాలు చెప్పడం తగదన్నారు. ఎఫ్సీఐ ఫిబ్రవరి 25 మార్చి 8న నిర్వహించిన సమావేశానికి తెలంగాణ హాజరు కాలేదు అనడం పచ్చి అబద్ధం అన్నారు గంగుల కమలాకర్. ఆ సమావేశానికి హాజరయ్యామని కేంద్ర మంత్రి  పియూష్ గోయల్ గారి శాఖ  ఇచ్చిన మినిట్స్ చూపించారు మంత్రి. ప్రతిసారి రా రైస్ మాత్రమే ఇవ్వండి అని కేంద్రం అంది అన్నారు. 

సీఎంఆర్ విషయంలోనూ అబద్దాలు..
సీఎంఆర్ విషయంలోనూ కేంద్రమంత్రి అబద్ధాలు ఆడారని దుయ్యబట్టారు మంత్రి గంగుల కమలాకర్,  సీఎంఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన రాహిత్యంతో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని, గత రబీ సీఎంఆర్ ఇవ్వలేదు అనడం అతని అవగాహనారాహిత్యం అన్నారు. సీఎంఆర్ అనేది నిరంతర ప్రక్రియ అని తెలియజేశారు మంత్రి గంగుల. కేరళలో రెండున్నర లక్షల మెట్రిక్ టన్నులకు, కర్ణాటక లోని పన్నెండు వేల మెట్రిక్ టన్నులకు, తెలంగాణలోని 60 లక్షల మెట్రిక్ టన్నులకు ఒకే రకంగా కేవలం మూడు నెలల గడువు ఇవ్వడం ఎలా సమంజసం అని ప్రశ్నించారు. ఇంత భారీ ఉత్పత్తిని ఆ సమయంలో సీఎంఆర్ చేయలేమనే విషయం కేంద్ర పెద్దలకు తెలుసన్నారు. అందుకోసం ప్రతిసారి గడువు పొడిగించడం అనేది గత 15 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రక్రియ అని అన్నారు, ఇందులోనూ గడువు పెంపు కోరిన ప్రతిసారీ తెలంగాణకు కేవలం నెల రోజులు మాత్రమే ఇవ్వటం వివక్ష కాదా అని ప్రశ్నించారు.
 
ఇక కిషన్ రెడ్డి చెప్పిన బాయిల్డ్ రైస్ ఇవ్వం అని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన ఒప్పందంపైన మంత్రి గంగుల వివరణ ఇచ్చారు. గత యాసంగి సీజన్ సేకరణ ముగింపు దశలో ఇచ్చిన టార్గెట్ ను పునర్ సమీక్షిస్తూ కేవలం రా రైస్ మాత్రమే ఇవ్వమని కోరితే, 12 వేల కోట్లకు పైగా విలువగల పంటను సేకరించి రైతులకు డబ్బులు ఇచ్చిన తర్వాత వాటిని కేంద్ర ప్రభుత్వం చెల్లించం అనడం వల్ల జరిగే తీవ్ర నష్టాన్ని చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఎలా భరిస్తుందని ప్రశ్నించారు. ఆ సమయంలో ఒప్పందం మేరకు బాయిల్డ్ రైస్ తీసుకోవాల్సిందిగా ఎఫ్సీఐని కోరితే ముందుగా సిద్ధం చేసుకున్న మేరకు డాక్యుమెంట్ ను తీసుకొచ్చి భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వము అని మెడ మీద కత్తి పెట్టి తీసుకున్న ఒప్పందం అది కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రిగా ఆ ఒప్పందాన్ని మీరు ప్రశ్నించాల్సింది పోయి తెలంగాణ ప్రజలకు, రైతులకు నష్టం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు మంత్రి గంగుల.అయినప్పటికీ ఇంకా గత యాసంగి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకొలేదని గుర్తు చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన మరో ఆరోపణ సరైన సమయంలో బియ్యం ఇవ్వట్లేదు అనేదాన్ని తిప్పికొట్టారు మంత్రి గంగుల. ప్రతి నెల 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని కేంద్రానికి  తెలియజేసినా రాక్ లు ఖాళీ లేవు అనే సాకుతో కేవలం తెలంగాణా నుండి మూడు లక్షలు మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకెళ్తున్నారు. దీనిపై 16కు పైగా లేఖలు కేంద్రానికి రాసిన విషయాన్ని గుర్తు చేశారు, ఈ విషయం కేంద్ర మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. తీవ్ర ఒత్తిడి చేస్తే గత రెండు నెలలు మాత్రమే పది లక్షల మెట్రిక్ టన్నులు తీసుకున్నారన్నారు. కనీసం ఈ బియ్యం నిల్వ చేయడానికి గోదాములు కేటాయించామని కోరినా ఇవ్వలేదని కేంద్రాన్ని దుయ్యబట్టారు. ఈ వాస్తవాలు వక్రీకరించేలా తెలంగాణను బదనాం చేయడం తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డికి ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు మంత్రి గంగుల కమలాకర్. ఏప్రిల్ రెండు లోగా కేంద్రం, ప్రధాని పునరాలోచించి ధాన్యం సేకరణకు తెలంగాణకు అనుమతివ్వాలని కోరారు లేనిపక్షంలో గౌరవ సీఎం గారు, తెలంగాణ ప్రజలు రైతులు చేసే ఉద్యమం సెగ కేంద్రానికి తగులుతుందన్నారు.

కిషన్ రెడ్డి అబద్దాలు చెప్పడం తగదు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మార్చి నెల సమావేశానికి రాలేదు .. ఫిబ్రవరి సమావేశాలకు రాలేదు అని అబద్దాలు చెప్పడం బాధాకరం అన్నారు. మినిట్స్ తెప్పించుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన కిషన్ రెడ్డి తీరు బాలేదన్నారు. 16 సార్లు ఇప్పటి వరకు కేంద్రానికి లేఖలు రాశాం..తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే పండుతాయి. పాత కోటా 5 లక్షల టన్నుల బియ్యం ఇంకా తీసుకపోలేదు. నెలకు 10 లక్షల టన్నుల బియ్యం ఇచ్చే సామర్థ్యం తెలంగాణకు ఉంది. కానీ ఎన్నడూ 3 లక్షల టన్నులకు మించి తీసుకోలేదు.చివరగా మా బృందం వెళ్లి తీవ్ర వత్తిడి పెడితే రెండు నెలలు మాత్రం 10 లక్షల టన్నులు తీసుకున్నారన్నారు.

మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన కౌరవులు

రామాయణంలో సీతను చెరబట్టిన రావణాసురుడు ఫలితాన్ని అనుభవించాడు. ఈ దేశ రాజకీయాలలో తిరుగులేదనుకున్న ఇందిరాగాంధీ అనామకుల చేతిలో భంగపడింది.తెలంగాణను అవమానించిన, అవహేళన చేసిన ఎందరో రాజకీయ భవిష్యత్ లేకుండా పోయారు. చరిత్రపుటల్లో కప్పివేయబడ్డారు. ఎన్నో పోరాటాలు, మరెన్నో బలిదానాలు, అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల మేరకు.. ఎన్నో అడ్డంకులు, కుట్రలు చేధించి కేసీఅర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం.
కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఏడేళ్లుగా ఇష్టపడి అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటున్నాం. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సహకారం లేదు. కష్టపడి కాళేశ్వరం కట్టుకున్నాం. పాలమూరు రంగారెడ్డి 70 శాతం పనులు పూర్తయ్యాయి.  దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేశాం. 

మిషన్ కాకతీయతో చెరువులు బాగుచేసుకున్నాం. కృష్ణా గోదావరి నీళ్లతో వాటిని నింపుకుంటున్నాం.ఆరు దశాబ్దాల అన్యాయాల తాలూకు చేధు జ్ఞాపకాలు దిగమింగుకుంటూ ప్రగతి వైరు శరవేగంగా అడుగులు వేస్తూ నవ తెలంగాణ నిర్మించుకుంటున్నాం. వ్యవసాయం ప్రధానరంగంగా గుర్తించి కేసీఆర్ గారు ఈ రంగం మీద దృష్టి సారించారుకేసీఆర్ సాగునీళ్లిచ్చి, రైతుబంధు, రైతుభీమా ఇచ్చి, 24 గంటల ఉచిత కరంటు ఇచ్చి చేదోడా వాదోడుగా నిలుస్తున్నారు. అత్యధిక శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగం బలోపేతమయితే గ్రామాలు సుస్థిరమవుతాయన్నది కేసీఆర్  ఆలోచన. 

తెలంగాణ ప్రాంతంలో యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తయి. రా రైస్ రావు .. క్వింటాలుకు 67 శాతం బియ్యం రావు. కందులు, గోధుమలకు లేని నిబంధన వడ్లకు ఎందుకు ?సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేయకుండా మెదడుకు తాళం వేసుకుంటే మీరెందుకు ?కిషన్ రెడ్డి ఎన్నాళ్లు పదవిలో ఉంటావు ? రైతుల పక్షాన ఇక్కడ ఉన్న సమస్యపై ఎందుకు మాట్లాడవు ?ఏనాడైనా ఈ ప్రాంత ప్రతినిధిగా కేంద్ర మంత్రి వద్దకు వచ్చి మాట్లాడావా ?అన్ని తెలిసిన కిషన్ రెడ్డి ప్రతి గింజ కొంటం. అంటడు రా రైసే కావాలి అంటడు. యూపీఎ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ కేంద్రం సహకరించడం లేదన్నాడు. ఈ రోజు కేంద్రం మళ్లీ అదేవిధంగా వ్యవహరిస్తున్నది. కాలానుగుణంగా కేంద్రం మారడం లేదు .. రైతుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. ఇథనాల్ తయారీ వైపు ఎందుకు దృష్టి సారించడం లేదు .. గతంలో మీరే దానికి జై కొట్టారు. సెనెగల్ తదితర ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతుల అవకాశం ఉంది. పాశ్చాత్య దేశాలలో ఫోర్క్ లను పెద్ద ఎత్తున పెంచుతారు. వాటికి ప్రధానఆహారం బియ్యమే .. కానీ అసలు కేంద్రం ఈ దిశగా దృష్టి సారించడం లేదు. ఉత్తరభారతంలో ఓపెన్ గోదాంలలో బియ్యం నిల్వలు పేరుకుపోయి దుర్వినియోగం అవుతున్నాయి .. పేదలకు వాటిని పంచి ఎందుకు నిల్వలు ఖాళీచేయరు.

తెలంగాణ ప్రజల కోసం మేం ఎన్ని అవమానాలయినా భరిస్తాం .. కానీ సమయం వచ్చినప్పుడు తెలంగాణ బదులు తీర్చుకుంటుంది. కేంద్రం తీరు అత్యంత అవమానకరంగా ఉంది .. ఇంత పెద్ద భారతదేశంలో రాష్ట్రాలతో కేంద్రం అనుసరించే తీరు బాధాకరం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 వరకు అన్ని గ్రామపంచాయతీలు, మండలాలు, జడ్పీలలో కేంద్రం వడ్లు కొనాలని తీర్మానాలు చేసి ప్రధానితో పంపుతాం. ఉగాది తర్వాత ఉద్యమ ఉదృతి చూయిస్తాం. రైతుల ఉసురు పోసుకున్న సర్కార్ల నిలవలేదు. తెలంగాణ వ్యవసాయం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిందో తెలంగాణ  రైతాంగానికి తెలుసు. కేసీఆర్ , టీఆర్ఎస్ ఉన్నంతవరకు తెలంగాణ రైతులు భయపడాల్సిన అవసరం లేదు.కేసీఆరే రైతులకు రక్షణ కవచం అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu