హైద్రాబాద్ లో సెటిల్ మెంట్లు: పోలీసుల అదుపులోకి నయీం ప్రధాన అనుచరుడు శేషన్న

By narsimha lode  |  First Published Sep 27, 2022, 10:20 AM IST

గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఆయనను అరెస్ట్ చూపే అవకాశం ఉంది. నయీం ఎన్ కౌంటర్ తర్వాత  శేషన్న పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. 


హైదరాబాద్: పోలీసుల ఎన్ కౌంటర్ లో మృతి చెందిన గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హైద్రాబాద్ టాస్క్ పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయుధాల చట్టం కింద ఆయనను అరెస్ట్ చూపించే అవకాశం ఉందని సమాచారం.  బతికున్న సమయంలో నయీం చేసిన ప్రతి కార్యక్రమంలో శేషన్న పాత్ర ఉందని పోలీసులు గతంలో ప్రకటించారు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత శేషన్న పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో కొంత కాలం తలదాచుకున్న తర్వాత శేషన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత శేషన్న సెటిల్ మెంట్లు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

హైద్రాబాద్ కొత్తపేటలో సెటిల్ మెంట్ చేస్తున్న సమయంలో సోమవారం నాడు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. శేషన్న వద్ద 9 ఎంఎం  పిస్టల్ ను పోలీసులు సీజ్ చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ టీవీ 9 కథనం ప్రసారం చేసింది. 

Latest Videos

undefined

ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురు ప్రజా సంఘాల నేతల హత్యలు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, కానిస్టేబుల్ హత్య కేసుల్లో కూడా శేషన్న నిందితుడిగా ఉన్నాడు. నయీం ఎన్ కౌంటర్  తర్వాత శేషన్న  పోలీసులకు చిక్కకుండా వెళ్లిపోయాడు. అయితే నిన్న కొత్తపేటలో సెటిల్ మెంట్ చేస్తూ టాస్క్ పోర్స్ పోలీసులకు శేషన్న చిక్కినట్టుగా సమాచారం.నయీంకి చెందిన ఆస్తులు, డెన్ లకు సంబంధించి కీలక సమాచారం శేషన్నకు తెలుసునని పోలీసులు అనుమానిస్తున్నారు. శేషన్న గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేశాడు. జనజీవన స్రవంతిలో చేరిన తర్వాత శేషన్ననయాంతో కలిసి పనిచేశాడు. 

also read:గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో కీలక పరిణామం: భార్య హాసీనాకి ఐటీ శాఖ నోటీసులు

2016 ఆగస్టు 16వ తేదీన షాద్ నగర్ లో నయీం ఎన్ కౌంటర్ జరిగింది. ఉదయం 8 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో నయీం మృతి చెందాడు. ఓ సెటిల్ మెంట్ కోసం షాద్ నగర్ కు వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు నయీంను ఎన్ కౌంటర్ లో హతమార్చారు. నయీం   కు సంబంధించి ఇళ్లలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో  పలు కీలక విషయాలు వెలుగు చూశాయి.  భారీగా డబ్బులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు సీజ్ చేశారు.ఎన్ కౌంటర్ తర్వాత నయీం బాధితులు పలువురు  పోలీసులకు ఫిర్యాదులు చేశారు. నయీంకి చెందిన రూ. 150 కోట్ల ఆస్తుల్లో 10 ఆస్తులను ఐటీ శాఖ ఈ ఏడాది మార్చి మాసంలో సీజ్ చేసింది. ఈ ఆస్తుల విషయమై ఐటీ శాఖ నోటీసులు నయీం భార్య హసీనాకు నోటీసులు  జారీ చేసింది. 

click me!