ఒంటరి మహిళలే టార్గెట్.. హత్య చేసి, నగలు దోచుకుని.. వరుస హత్యలకు పాల్పడుతున్న 60 ఏళ్ల వ్యక్తి అరెస్ట్..

By SumaBala BukkaFirst Published Sep 27, 2022, 7:33 AM IST
Highlights

ఓ 60 యేళ్ల వ్యక్తి ఒంటరి మహిళల్నే టార్గెట్ గా వరుస హత్యలకు పాల్పడుతున్నాడు. మహిళల్ని వారిని హత్య చేసి, నగదుతో పరారవుతున్నాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

నిజామాబాద్ : డబ్బుల కోసం ఒంటరిగా ఉన్న మహిళలనే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్న ఓ నిందితుడు నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని నాగారానికి చెందిన అల్లెపు  మల్లయ్య  అలియాస్ రాజు  60 ఏళ్ల వయసులో వరుస హత్యలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఇతనిపై వివిధ జిల్లాల్లో 16 కేసులు నమోదై ఉన్నాయి. కమిషనరేట్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ నాగరాజు వివరాలు వెల్లడించారు. 

మల్లయ్య కొంతకాలంగా దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్నాడు. దీనిపై రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డిలతోపాటు నిజామాబాద్ లో పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆగస్ట్ 24న మాక్లూర్ మండలం డీకంపల్లి వద్ద పత్తి లక్ష్మి (56) మృతదేహం లభించింది. చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఆమె ఆటో ఎక్కిన తర్వాత ఇలా జరిగింది. ఆటో ఆధారంగా మాక్లూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా మల్లయ్యతో పాటు అతని అల్లుడు పోశెట్టిని నిందితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మల్లయ్య పాత నేరస్థుడిగా తేలింది. 

విద్యార్థులతో చేతులు కలిపి, కలసి భోంచేసి, మాటిచ్చి... (ఫొటోలు)

2019లో జక్రాన్ పల్లిలో ఓ మహిళ తలపై దాడిచేసి నగదు అపహరించుకుని వెళ్లారు. 2020లో ముస్లిం  ముప్కాల్ మండలంలోని  పంట పొలంలో ఉన్న మహిళను హత్యచేసి నగదు దోచుకెళ్లారు. జూలైలో కామారెడ్డి జిల్లా లింగంపేటలో కిరాణా దుకాణంలో ఉన్న మహిళపై దాడి చేసి నగలూ ఎత్తుకెళ్లాడు. అతని నుంచి 15 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏసిపి ఆర్ వెంకటేశ్వర్ నేతృత్వంలోని సిఐలు రాజశేఖర్, నరహరి, ఎస్సైలు యాదగిరి గౌడ్, రాజేశ్వర్గౌడ్,  సిబ్బంది రామకృష్ణ, వేణు, ప్రవీణ్, నీలేష్, అఫ్సర్ బృందాన్ని సిపి అభినందించారు. 

click me!