ఖమ్మంలో బాలిక కిడ్నాప్.. వెలుగులోకి ఫోటో షూట్ పేరుతో అమ్మాయిలకు వలవేసి, వ్యభిచారంలోకి దింపే ముఠా..

By SumaBala BukkaFirst Published Sep 23, 2022, 10:04 AM IST
Highlights

ఖమ్మంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్ అయ్యింది. దీంతో ఫోటోషూట్ పేరుతో అమ్మాయిలకు వలవేసి.. వ్యభిచారంలోకి దింపే ముఠా విషయం వెలుగులోకి వచ్చింది. 
 

ఖమ్మం :  మధ్యతరగతి అమ్మాయిలే లక్ష్యంగా.. వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని.. మాయమాటలు చెప్పి, వలవేసి..  వ్యభిచారం చేసేలా ప్రోత్సహిస్తోంది ఓ ముఠా.  ఇలా ఖమ్మం జిల్లా మధిరలో ఓ ఫొటోగ్రాఫర్ మరికొందరు కలిసి చేస్తున్న ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో బుధవారం ఓ బాలిక కిడ్నాప్  కావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.  మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక ఫోటో స్టూడియో ఉంది. అందులో పనిచేస్తున్న ఏపీలోని కడప జిల్లాకు చెందిన బాల గురివిరెడ్డి గతంలో స్టేషన్ రోడ్డులో ఓ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. 

ఈ క్రమంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ ఇంటి యజమాని కూతురును బుధవారం రాత్రి కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళాడు. తెల్లవారేసరికి బాలిక కనపడకపోవడంతో తల్లిదండ్రులు చాలా వెతికారు. చివరికి కాలనీలో సీసీ కెమెరాలను పరిశీలించగా ఫోటోగ్రాఫర్ తమ ఇంటి గోడదూకిన దృశ్యం కనిపించింది. దీంతో తమ కూతురిని బాల గురివిరెడ్డి కిడ్నాప్ చేశాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కాగా,  మధిరతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల్లో ఫోటో, వీడియో షూటింగ్ లకు వెళ్లిన ఫోటోగ్రాఫర్లు అక్కడ ఈవెంట్ మేనేజ్ మెంట్ లో పనిచేసే అమ్మాయిలతో పాటు కొందరు బ్యూటీషియన్లను ట్రాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘సూది మందు’ అనుమానం.. భయంతో ఆటోలోంచి దూకిన ఇంటర్ విద్యార్థి..

వారి బలహీనతలను అవకాశంగా తీసుకుని అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులయ్యేలా ఎరవేస్తున్నట్టు తెలుస్తోంది. మధిరలోని స్టూడియో వారికి యానాంలో ఒక హోటల్ వారితో పరిచయం ఉండడంతో, వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రూం ఏర్పాటు చేస్తారు. అనేకసార్లు అమ్మాయిలను మేకప్ కోసమని, ఈవెంట్ పేరుతో అక్కడికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరికొందరిని షూటింగ్ ల పేరుతో లద్దాక్ కు.. ఓ బ్యూటీషియన్ ను ఫోటోషూట్ ఉందని ఐదురోజులపాటు గోవాకు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరు విజయవాడ, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్వహించే ఈవెంట్లను షూట్ చేసేందుకు వెళ్లి, అక్కడ వారికి ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయిలను, బ్యుటీషన్లను వలవేసి ఓ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు సమాచారం. నాలుగేళ్లుగా ఈ తతంగం నడుస్తోంది. తాజాగా బాలిక కిడ్నాప్ వ్యవహారంతో వీరి ఆగడాలపై మదిరలో చర్చ జరుగుతోంది. 

click me!