ఇల్లు దాటకున్నా హైద్రాబాద్‌లో ఇద్దరికి కరోనా

By narsimha lodeFirst Published Apr 15, 2020, 10:45 AM IST
Highlights
ఇంటి గడప దాటకున్నా హైద్రాబాద్ నగరంలో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. అయితే వీరికి కరోనా ఎలా సోకిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. హైద్రాబాద్ నగరం పరిధిలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.
 
హైదరాబాద్: ఇంటి గడప దాటకున్నా హైద్రాబాద్ నగరంలో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. అయితే వీరికి కరోనా ఎలా సోకిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. హైద్రాబాద్ నగరం పరిధిలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.

హైద్రాబాద్ గాంధీనగర్ కు చెందిన ఓ వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆయనకు కాళ్లు, చేతులు పనిచేయవు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఆయన వయస్సు 48 ఏళ్లు. ఆయనతో పాటు ఉండే కుటుంబసభ్యులు విదేశాలకు కానీ, ఇతర ప్రాంతాలకు వెళ్లలేదు. దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుండడంతో పరీక్షలు నిర్వహిస్తే ఆయనకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా తేలింది. దీంతో వైద్యులు షాకయ్యారు.

also read:కరోనా వైరస్: ఒక్కడి నుంచి 19 మందికి కోవిడ్ -19 పాజిటివ్

హైద్రాబాద్ టోలిచౌకికి చెందిన ఎనిమిదేళ్ల బాలికకు కూడ కరోనా సోకింది. దగ్గు, జలుబు, జ్వరంతో ఆ బాలిక బాదపడడతంతో వైద్యులు ఆమెను పరీక్షిస్తే కరోనా సోకినట్టుగా తేలింది. ఈ బాలిక తల్లిదండ్రులు కూడ ఇతర ప్రాంతాలకు వెళ్లలేదు. ఈ బాలికకు ఎలా ఈ వైరస్ సోకిందో అంతుపట్టక అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ హిస్టరీ లేని వారికి కూడ కరోనా వైరస్ సోకడం ఆందోళన కల్గిస్తోంది. ఈ రకంగా ఈ వైరస్ సోకిన వారిలో కొందరికి వైరస్ లక్షణాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలు కన్పించడం లేదు.

కరోనా వైరస్ సోకినవారు తుమ్మడం లేదా దగ్గిన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వైరస్ గాలి ద్వారా ఇతరులకు సంక్రమించే అవకాశం లేకపోలేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

విదేశాలు, ఇతర ప్రాంతాలతో పాటు మర్కజ్ నుండి వచ్చిన వారికి, వారితో సన్నిహితంగా మెలిగినవారికే కరోనా వైరస్ సోకినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. కానీ, ఈ రెండు ఘటనలు మాత్రం జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నాయి. 

సోమవారం ఉదయం నాటికి తెలంగాణలో 531 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్స తర్వాత కోలుకుని మరో 103 మంది ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం 412 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీటిలో ఒక్క గ్రేటర్‌ పరిధిలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి.జీహెచ్ఎంసీ పరిధిలోని 12 కంటైన్మెంట్‌ క్లస్టర్లను  123 జోన్లుగా విభజించింది. ఒక్కో జోన్‌లో 10 నుంచి 50 నివాసాలు ఉండే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 










 
click me!