ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నర్సులతో చర్చలు సఫలం: గాంధీలో సమ్మె విరమణ

By narsimha lode  |  First Published Jul 15, 2020, 5:30 PM IST

గాంధీ ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నర్సులతో ప్రభుత్వం జరిపిన చర్చలు బుధవారం నాడు సాయంత్రం ఫలవంతమయ్యాయి. సమ్మె విరమించేందుకు నర్సులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అంగీకరించారు.


హైదరాబాద్:గాంధీ ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నర్సులతో ప్రభుత్వం జరిపిన చర్చలు బుధవారం నాడు సాయంత్రం ఫలవంతమయ్యాయి. సమ్మె విరమించేందుకు నర్సులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అంగీకరించారు.

ఆరు రోజులుగా గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ నర్సులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. బుధవారం నాడు వీరితో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలు విజయవంతమైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

Latest Videos

undefined

also read:కరోనా దెబ్బ: గాంధీభవన్ వారం పాటు మూసివేత

ఔట్ సోర్సింగ్ ద్వారా నర్సులుగా విధుల్లో ఉన్న వారి వేతనాలను రూ. 17,500 నుండి రూ. 25 వేలకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కరోనా విధుల్లో ఉన్న వాళ్లకు ప్రతి రోజూ డైలీ ఇన్సెంటివ్ కింద రూ. 750 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు విధానంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తామని డీఎంఈ హామీ ఇచ్చారు.

ఇక నాలుగో తరగతి ఉద్యోగతి ఉద్యోగులకు డైలీ ఇన్సెంటివ్ కింద రూ. 300 చెల్లించనున్నారు. అంతేకాదు నెలలో 15 రోజుల పాటు మాత్రమే విధులను కేటాయించనున్నారు.ఆరు రోజులుగా సాగుతున్న సమ్మెకు ఇవాళ్టి నుండి ముగింపు పడనుంది. నర్సులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడ సమ్మె విరమించేందుకు అంగీకరించినట్టుగా అధికారులు ప్రకటించారు

click me!