గద్దర్ పార్థీవదేహనికి నివాళి: కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్

By narsimha lode  |  First Published Aug 7, 2023, 6:00 PM IST

ప్రజా యుద్దనౌక గద్దర్ పార్థీవ దేహనికి తెలంగాణ సీఎం కేసీఆర్  ఇవాళ నివాళులర్పించారు.

.
హైదరాబాద్: ప్రజాయుద్దనౌక గద్దర్  పార్థీవ దేహం వద్ద పూలమాల వేసి తెలంగాణ సీఎం కేసీఆర్  నివాళులర్పించారు. సోమవారంనాడు సాయంత్రం గద్దర్ బౌతిక కాయాన్ని ఆయన  ఇంటికి తీసుకువచ్చారు. గద్దర్ నివాసానికి  చేరుకున్న కేసీఆర్  ఆయన బౌతిక కాయానికి నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. వారికి  ధైర్యం చెప్పారు. సీఎం కేసీఆర్ వెంట  హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ తదితరులున్నారు.గద్దర్ కునివాళి అర్పించిన తర్వాత  కేసీఆర్  తిరిగి ప్రగతి భవన్ కు వెళ్లిపోయారు. 

Latest Videos

గద్దర్ ను కడసారి చూసేందుకు  వేలాది మంది  గద్దర్ అభిమానులు  అల్వాల్ కు చేరుకున్నారు.  అయితే  అడుగడుగునా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు  చేసి వారిని నిలువరించారు. ఇవాళ సాయంత్రం అల్వాల్ కు  చేరుకున్న గద్దర్ పార్థీవ దేహన్ని  కొద్దిసేపు అతని నివాసంలో ఉంచారు. గద్దర్ సతీమణి సహా కుటుంబ సభ్యులు  కన్నీరు మున్నీరుగా విలపించారు. గద్దర్ నివాసంతో పాటు గద్దర్ ఏర్పాటు  చేసిన  మహాబోధి స్కూల్  వద్ద  వేలాది మంది  జనం  ఉన్నారు.

also read:ఎల్‌బీ స్టేడియం నుండి అల్వాల్ కు చేరుకున్న గద్దర్ పార్థీవ దేహం: కాసేపట్లో అంత్యక్రియలు

ఇవాళ మధ్యాహ్నం ఎల్ బీ స్టేడియం నుండి  గద్దర్ బౌతిక కాయం ఊరేగింపుగా  అల్వాల్ కు తీసుకు వచ్చారు.  అల్వాల్ కు బౌతిక కాయం చేరుకునేసమయానికి సాయంత్రం అయింది.  అల్వాల్ లోని నివాసంలో  గద్దర్ బౌతిక కాయాన్ని ఉంచారు.  పలువురు సినీ, రాజకీయ, కళాకారులు, విఐపీలు , మంత్రులు, గద్దర్ పార్థీవ దేహనికి నివాళులర్పించారు.

click me!