గద్దర్ పై కరాటే కళ్యాణి వివాదాస్పద పోస్ట్... ఎర్ర బ్యాచ్ అంటూ ఎద్దేవా..  నెటిజన్ల ఆగ్రహం 

Published : Aug 07, 2023, 06:32 PM IST
గద్దర్ పై కరాటే కళ్యాణి వివాదాస్పద పోస్ట్... ఎర్ర బ్యాచ్ అంటూ ఎద్దేవా..  నెటిజన్ల ఆగ్రహం 

సారాంశం

ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిందే.. ఆయన మరణం పట్ల లక్షలాది మంది దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇలాంటి సమయంలో బీజేపీ నాయకులు, నటి, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి.. గద్దర్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన  అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం మధ్యాహ్న తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ .. మార్గదర్శకంగా నిలిచారు. ఆయన మరణం పట్ల లక్షలాది దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కానీ.. ఈ సమయంలో  బీజేపీ నాయకులు, నటి  కరాటే కళ్యాణి ప్రజాకవి గద్దర్ పై పిచ్చికూతలు కూసింది.  సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తూ వివాదాస్పద పోస్టు చేసింది. దీంతో ప్రజాకవి అభిమానుల ఆగ్రహనికి గురైంది. 

ఇంతకీ ఏం జరిగింది? 

నటి  కరాటే కళ్యాణి ప్రజాకవి గద్దర్ పై ఫేస్ బుక్ లో ఎద్దేవా చేస్తూ వివాదాస్పద పోస్టు చేసింది. ‘ఎర్ర పాట...మూగబోయింది...కన్నీటి వీడ్కోలు... ఓం శాంతి’ అంటూ తొలుత పోస్ట్ చేసింది. ఆ తరువాత కాసేపటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. మరో పోస్టు చేసింది.  ‘బాలు గారు విశ్వనాథ్ గారు సిరివెన్నెల గారు వెళ్లిపోయిన రోజున ఎర్ర బ్యాచ్ ఏమన్నారు మర్చిపోలేదు కానీ పోయినోల్లని తిట్టే సంస్కారం మా ధర్మం లో లే’ అంటూ పోస్ట్ చేసింది.

గద్దరన్న అభిమానులు ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘అసలు మహా వ్యక్తి చనిపోతే ఇలాంటి పోస్ట్ పెడతావా? అందుకే .. నన్ను వివాదాల బరిన పడుతావ్.. చనిపోయిన వారిని  తిట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది. నువ్వు మనిషివేనా? అంటూ ఓరేంజ్‌లో దుమ్మెత్తిపోస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!