'నన్ను కిడ్నాప్ చేయబోయారు': యాదాద్రి గద్దరాళ్లతండాలో పోలీసులపై దాడిలో ట్విస్ట్

By narsimha lodeFirst Published Jan 29, 2023, 5:20 PM IST
Highlights

యాదాద్రి భువనగిరి  జిల్లా బొమ్మలరామారం  మండలం గద్దరాళ్లతండాకు చెందిన  చందు అనే వ్యక్తి  బొమ్మలరామారం  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను నలుగురు వ్యక్తులు కిడ్పాప్ నకు ప్రయత్నించారని  ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా  బొమ్మలరామారం మండలం  గద్దరాళ్లతండాలో  పోలీసులపై గ్రామస్తులు దాడికి దిగారు. దొంగలుగా భావించి  పోలీసులపై గ్రామస్థులు దాడి చేశారు. అయితే  పోలీసులు  ఎవరి కోసం  గ్రామానికి వచ్చారో  ఆ వ్యక్తి పోలీసులపై ఫిర్యాదు చేశాడు. తనను నలుగురు  వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు  ప్రయత్నించారని  గద్దరాళ్లతండాకు  చెందిన చందు అనే వ్యక్తి  బొమ్మలరామారం పోలీసులకు   ఆదివారం నాడు  ఫిర్యాదు  చేశారు. 

షామీర్ పేట పోలీస్ స్టేసన్ పరిధిలోని  ఉద్దెమర్రిలో ఈ నెల  23న  కాల్పులు  జరిగిన  ఘటనపై  నిన్న రాత్రి గద్దరాళ్ల తండాకు పోలీసులు వెళ్లారు. ఈ తండాకు వెళ్లిన పోలీసులను దొంగలుగా భావించిన  గ్రామస్తులు దాడికి దిగారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.  ఉద్దేశ్యపూర్వకంగా  దొంగలు వచ్చారని  అరిచారని ఒకరిపై  పోలీసులు అనుమానిస్తున్నారు.  ఉద్దేశ్యపూర్వకంగానే  అతను అరిచినట్టుగా  పోలీసులు భావిస్తున్నారు.  శనివారం నాడు  రాత్రి  11 గంటల సమయంలో  పోలీసులు సివిల్ దుస్తుల్లో  తండాకు  చేరుకున్నారు.  చందు అనే వ్యక్తి  కోసం ఆరా తీశారు.  లారీ డ్రైవర్ గా పనిచేసేచందు ఇంటిని గ్రామస్తుడొకరు చూపారు.ఇటుకను  భువనగిరిలో  డంప్ చేయాలని   చందును అడిగారు. అయితే రేపు ఉదయం  మాట్లాడుదామని  చందు వారికి చెప్పాడు.  అయితే  మా సార్ తో  ఈ విషయమై  మాట్లాడాలని చందును ఇంటి నుండి బయటకు తీసుకు వచ్చారు.  తమ కారు వద్దకు  చందు రాగానే అతడిని కారులో తీసుకెళ్లేందుకు  పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో  పోలీసులతో  చందు  గొడవ పడ్డారు. చందు వెంట అతని బంధువు కూడా  ఉన్నాడు. ఈ ఘటనతో  చందుతో పాటు  అతని బంధువు కేకలు వేశారు. దీంతో  స్థానికులు వచ్చి  పోలీసులను చితకబాదారు. తాము పోలీసులమని  వారు చెప్పారు.  వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డులను చూసి గ్రామస్తులు వారిని వదిలేశారు.   

also read:కారణమిదీ: యాదాద్రి గద్దరాళ్లతండాలో పోలీసులపై గ్రామస్తుల దాడి

ఈ ఘటనకు సంబంధించి  చందు బొమ్మలరామారం  పోలీసులకు  ఇవాళ  ఫిర్యాదు  చేశారు. తనను నలుగురు వ్యక్తులు కిడ్నాప్  చేసేందుకు  ప్రయత్నించారని  చందు  ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  కేసు విచారణకు సహకరించాలని పోలీసులు కోరితే  తాను సహకరించేవాడినని చందు చెబుతున్నారు. ఉద్దెమర్రి మద్యం దుకాణం వద్ద దోపీడీతో తనకు  సంబంధ: లేదని  చందు చెబుతున్నారు. 
 

click me!