రఘునందన్ రావుకు అసమ్మతి సెగ.. 5 మండలాల బీజేపీ నేతల రహస్య భేటీ

By Siva KodatiFirst Published Jan 29, 2023, 5:18 PM IST
Highlights

బీజేపీ సీనియర్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై సొంత పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఆయన తమను పట్టించుకోవడం లేదంటూ తొగుట, దౌల్తాబాద్, దుబ్బాక, చేగుంట, మిరుదొడ్డి బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. 

సిద్దిపేట జిల్లా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై సొంత పార్టీలోనే నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. రఘునందన్ రావుకు వ్యతిరేకంగా మిరుదొడ్డిలో మరొకసారి సమావేశమయ్యారు బీజేపీ సీనియర్ నేతలు. ఈ భేటీలో తొగుట, దౌల్తాబాద్, దుబ్బాక, చేగుంట, మిరుదొడ్డి బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ నెల 2న రఘునందన్ రావుకు వ్యతిరేకంగా, రహస్యంగా వారు సమావేశమయ్యారు. తమను రఘునందన్ రావు పట్టించుకోవడం లేదని, ఆయన బీఆర్ఎస్ కోవర్టు అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు సొంత పార్టీ నేతలు. 

ALso REad: కేడర్ వివాదం.. డీజీపీని కూడా సోమేష్ లాగే ఏపీకి పంపాలి : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

ఇదిలావుండగా.. రఘునందన్ రావు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమేశ్ కుమార్ తరహాలో కొందరు అధికారులు సొంత కేడర్‌లో కాకుండా తెలంగాణలో కొనసాగుతున్నారని ఆయన మండిపడ్డారు. వీరిలో డీజీపీ అంజనీ కుమార్ కూడా వున్నారని.. ఆయనను కూడా ఏపీ కేడర్‌కు బదిలీ చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణలో వున్న ఏడీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై పీఎంవోకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అఖిల భారత సర్వీస్ అధికారులు ఎక్కడ పోస్టింగ్‌లు లభిస్తే అక్కడికి వెళ్లి విధులు నిర్వర్తించాల్సి వుంటుందని, సుప్రీంకోర్ట్ మార్గదర్శకాలు కూడా ఇదే చెబుతున్నాయని రఘునందన్ రావు పేర్కొన్నారు. అయితే క్యాట్ నిర్ణయంతో 15 మందిని సొంత కేడర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారని.. ఇది సుప్రీంకోర్ట్ తీర్పుకు విరుద్ధమని ఆయన దుయ్యబట్టారు. 

click me!