శ్రీశైలంలో టీఎస్ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. కొద్దిలో మిస్, లేదంటే జలాశయంలోకే

Siva Kodati |  
Published : Jan 29, 2023, 04:46 PM ISTUpdated : Jan 29, 2023, 04:47 PM IST
శ్రీశైలంలో టీఎస్ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. కొద్దిలో మిస్, లేదంటే జలాశయంలోకే

సారాంశం

శ్రీశైలం జలాశయం దగ్గర టీఎస్ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రహారిగోడ ఇనుప బారికేడ్ వల్ల అక్కడే నిలిచిపోయింది బస్సు.  ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు వున్నట్లుగా తెలుస్తోంది.

శ్రీశైలం జలాశయం దగ్గర టీఎస్ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. జలాశయం మలుపు దగ్గర అదుపుతప్పి ప్రహారిగోడను ఢీకొట్టింది బస్సు. అయితే ప్రహారిగోడ ఇనుప బారికేడ్ వల్ల అక్కడే నిలిచిపోయింది బస్సు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సులోంచి కిందకి దిగేశారు. శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు వున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Telangana Jobs : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్ ... నెలనెలా రూ.81.400 శాలరీతో గవర్నమెంట్ జాబ్స్
తెలుగోళ్లకు మాత్రమే ఈ ఆఫర్.. SBI లో అకౌంట్ ఉంటే చాలు కోటి రూపాయలు