
ప్రజా యుద్దనౌక గద్దర్ కాంగ్రెస్ నేతలతో భేటీ కావడం రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తో గద్దర్ భేటీ అయిన విషయం తెలిసిందే.
దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ గద్దర్ ఎన్నడూ లేనిది కాంగ్రెస్ నేతలతో ఎందుకు కలిశారు. ఏ విషయంపై చర్చించారు అనేది కాంగ్రెస్ కాని, గద్దర్ కాని బయటికి ప్రకటించలేదు.
అయితే 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న తెలంగాణ కాంగ్రెస్ అందులో భాగంగా ప్రజాకర్షణ ఉన్న గద్దర్ ను దగ్గరకు తీయనుందా అనే అనుమానం కలుగుతోంది.
మరోవైపు గద్దర్ కు సీఎం కేసీఆర్ కు మధ్య మొదటి నుంచి పెద్దగా సంబంధాలు ఏమీ లేవు.
పీఠం ఎక్కగానే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా దళితుడిని సీఎం చేయకుండా కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అయ్యాడు. దీనిపై దళితవర్గంలో బాగానే వ్యతిరేకత ఉంది.
మరోవైపు రెండున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి అంతా సానుకూల స్పందన కూడా ఏమీ లేదు.
ఈ నేపథ్యంలో ప్రజల వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు దళితవర్గం నుంచి అందులో ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న గద్దర్ వైపు కాంగ్రెస్ చూస్తున్నట్లు అనిపిస్తోంది.