రేవంత్ జైలుకెందుకు వెళ్లాడు... బ్రీఫ్డ్ మీ ?

Published : Dec 12, 2016, 10:14 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
రేవంత్ జైలుకెందుకు వెళ్లాడు... బ్రీఫ్డ్ మీ ?

సారాంశం

రేవంత్ రెడ్డి వీడియో తో పాటు ఒక అధినేత ఫోన్ సంభాషణ కూడా బయట పడింది. అంత చక్కటి ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఉన్న ఆ అధినేత వాయిస్ ఎవరిది అనేది చెడ్డీలు వేసుకున్న బుడ్డోడు కూడా చెప్పగలడు.  

 

ఇకపై నోట్లిచ్చి ఓట్లు కొనడం మన దేశంలో అవినీతి కిందకి రాకపోవచ్చు.  అది చట్టవిరుద్ధం అసలే కాకపోవచ్చు.

 

ఇటీవల తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కుంభకోణంపై కోర్టు ఇచ్చిన తీర్పు గమనిస్తే ఇలా అపోహపడే ప్రమాదం ఉంది.

 

ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న ఏపీ సీఎం చంద్రబాబు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలసిందే.

 

ఈ కేసులో బాబు పాత్ర ఏమీ లేదని కోర్టు తేల్చింది.

 

ఈ కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేపట్టాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

 

ఎమ్మెల్సీ సీట్ల కొనుగోలుపై  స్టీఫెన్ సన్ కు డబ్బులు ఇవ్వజూపుతూ తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కెమెరాల ముందు అడ్డంగా దొరికిపోయిన విషయం దేశమంతా చూసిందే.

 

అందులో రేవంత్ రెడ్డి వీడియో తో పాటు ఒక అధినేత ఫోన్ సంభాషణ కూడా బయట పడింది. అంత చక్కటి ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఉన్న ఆ అధినేత వాయిస్ ఎవరిది అనేది చెడ్డీలు వేసుకున్న బుడ్డోడు కూడా చెప్పగలడు.

 

కానీ, అన్నింటికీ మూలకారకుడైన ఆయన కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కలేదు.

 

కానీ, పాపం డబ్బులు తీసుకొచ్చిన పాపానికి రేవంత్ రెడ్డి మాత్రం కొన్ని నెలలు జైలులో చిప్పకూడు తినాల్సి వచ్చింది.

 

అయితే ఇక్కడ ‘లా’ తెలియని సామాన్యుడిని ఒకే ప్రశ్న వేధిస్తోంది.  డబ్బు ఇవ్వజూపిన సూత్రధారి బాగానే ఉన్నాడు. తీసుకోబోయిన వ్యక్తి బాగానే ఉన్నాడు. కానీ, మధ్యవర్తిగా వచ్చిన ‘తమ్ముడు’ మాత్రం చిప్పకూడు తిన్నాడు.

 

అదే... ఎందుకో... తెలియడం లేదు....  ఎవరైనా కాస్త ‘బ్రీఫ్’ మీ.

PREV
click me!

Recommended Stories

Ponnam Prabhakar VS Pawan Kalyan | Pawan Kalyan Counter To Ponnam | Asianet News Telugu
WhatsApp e Challan: వాహనదారులకు అలర్ట్.. వాట్సాప్‌లోనే ట్రాఫిక్ చలాన్లు.. 30 రోజుల్లో ఆ పని చేయకపోతే లైసెన్స్ కట్ !