ఏపీ రాజకీయాలపై నాయిని సంచలన కామెంట్

Published : Oct 08, 2018, 03:59 PM IST
ఏపీ రాజకీయాలపై నాయిని సంచలన కామెంట్

సారాంశం

వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు అధికారం దక్కించుకోబోతున్నారో ఆయన జోస్యం చెప్పారు.

ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు అధికారం దక్కించుకోబోతున్నారో ఆయన జోస్యం చెప్పారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన నాయిని.. ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధికారంలోకి వస్తాడని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డికి దమ్ముంటే టీఆర్‌ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద గెలవాలని సవాల్ విసిరారు. ఎన్నికల విషయంలో ఈసీనే సుప్రీం అని, కోర్టుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ ఓటమి ఖాయమని తేలిపోయిందని ఎద్దేవాచేశారు. 

తన చెంచాలు ఒకరిద్దరు అసెంబ్లీలో ఉండాలని, కాంగ్రెస్‌తో సీఎం చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఓ బచ్చా.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని నాయిని మండిపడ్డారు. కేసీఆర్‌ను తిట్టేందుకే రేవంత్‌ని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని, రేవంత్ భూకబ్జాదారుడని నర్సింహారెడ్డి ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?