కారణమిదీ: బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తో గద్దర్ భేటీ

By narsimha lodeFirst Published Sep 4, 2022, 12:43 PM IST
Highlights

ప్రజా గాయకుడు  గద్దర్ ఆదివారం నాడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో భేటీ అయ్యారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని గద్దర్ కోరారు. ఈ విషయమై పార్లమెంట్ లో కోరాలని గద్దర్ కోరారు.
 

హైదరాబాద్:ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారంనాడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ తో భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని  గద్దర్ కోరారు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాలని కూడా ఆయన బండి సంజయ్ ను కోరారు.
ప్రజా సంగ్రామ యాత్ర ముంగిపును పురస్కరించుకొని తుక్కుగూడలో నిర్వహించిన బీజేపీ సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షాతో గద్దర్ భేటీ అయ్యారు. ఆయనకు వినతి పత్రమ సమర్పించారు. 

ఈ ఏడాది జూన్ 3న నిర్వహించిన బీజేపీ విజయ్ సంకల్ప్ సభలో గద్దర్ పాల్గొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైద్రాబాద్ లో నిర్వహించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపును పురస్కరించుకొని  హైద్రాబాద్ లో విజయ్ సంకల్ప్ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. 

నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులకు 2020 డిసెంబర్ 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.2021 జనవరి 15న నూతన పార్లమెంట్ భవ ని నిర్మాణ పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. 

 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో  నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. బేస్్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ 13,675 మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.గ్రౌండ్ ఫ్లోర్ లో 20,300, మొదటి అంతస్తు 16,680, రెండో అంతస్తు 8,100,మూడో అంతస్తు4,463  చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.

పార్లమెంట్ కొత్త భవన నిర్మాణంలో  2 వేల మంది ప్రత్యక్షంగాను, 9 వేల మంది పరోక్షంగా పాల్గొంటున్నారు. 1224 మంది ఎంపీలు ఒకేసారి కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. భారత ప్రజాస్వామ్య వైభవాన్ని చాటి చెప్పే ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు, పార్లమెంటు సభ్యుల కోసం విశాలమైన లాంజ్‌, గ్రంథాలయం నూతన పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. 2022 అక్టోబరు నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. 

click me!