ఈ నెల 25వ తేదీన జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు కరోనా సోకడంతో ఈ సమావేశం వాయిదా పడింది.ఈ సమావేశం వాయిదా పడడం ఇది రెండోసారి.
న్యూఢిల్లీ: ఈ నెల 25వ తేదీన జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు కరోనా సోకడంతో ఈ సమావేశం వాయిదా పడింది.ఈ సమావేశం వాయిదా పడడం ఇది రెండోసారి.
ఈ నెల 5వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకొంది. అయితే అదే రోజుల తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన కారణంగా ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జల్ మంత్రిత్వశాఖకు లేఖ రాశాడు. ఈ లేఖ ఆధారంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 25వ తేదీన ఏర్పాటు చేసింది కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ.
undefined
also read:కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు కరోనా: అపెక్స్ కౌన్సిల్ వాయిదాకు ఛాన్స్
ఈ సమావేశానికి రెండు రాష్ట్రాలు సమాయత్తమౌతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు ఈ నెల 20వ తేదీన కరోనా సోకింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టుగా కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది.
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని కేంద్ర జల్ మంత్రిత్వశాఖ తెలిపింది.