ఆదివారం నుంచి పాత సచివాలయానికి తాళం: సీఎస్ చేతికి తాళాలు

By Siva KodatiFirst Published Sep 27, 2019, 8:36 PM IST
Highlights

పాత సచివాలయ ప్రాంగణం నుంచి ఖాళీ చేసి వెంటనే వెళ్ళిపోవాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సచివాలయ భవనాల నుంచి శాఖల తరలింపు వేగవంతమవ్వగా.. 90 శాతం భవనాలు ఖాళీ అయ్యాయి.

ఈ క్రమంలో ఎల్లుండికల్లా పాత సచివాలయం పూర్తిగా ఖాళీ కానుంది. గ్రూపులుగా విడిపోయిన సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది.. మిగిలిన ఉన్న శాఖలను బీఆర్కేఆర్ భవనానికి తరలిపోవాలని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పాత సచివాలయ ప్రాంగణం ప్రధాన ద్వారానికి జీఏడీ అధికారులు తాళం వేయనున్నారు. ఈ తాళాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తామని.. అవసరం ఉన్నవారు సీఎస్ దగ్గర నుంచి వీటిని తీసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది సూచించారు. 

click me!