పాతబస్తీలో మజ్లీస్ తో బీఆర్ఎస్ దోస్తీ... పాత కొత్త కలయికతో అభ్యర్థుల ప్రకటన..

By SumaBala Bukka  |  First Published Aug 22, 2023, 9:12 AM IST

పాతబస్తీలో మజ్లిస్ కంచుకోటలో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇక్కడ మజ్లిస్ కు ఉపయోగపడేలా అభ్యర్థుల జాబితా ఉంది. 


హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఊపందుకుంటోంది.  అధికార బీఆర్ఎస్ పార్టీ  సోమవారం తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే పాతబస్తీలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పాతబస్తీ అంటే మజ్లిస్ కు కంచుకోట అన్న సంగతి తెలిసిందే. పాతబస్తీలో టిఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను సోమవారంనాడు కెసిఆర్ తొలి విడత జాబితాలో విడుదల చేశారు.  

గోషామహల్ మినహా మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ఈ జాబితాలో వెల్లడించారు. మైనారిటీలు అత్యధిక సంఖ్యలో ఉండే ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇద్దరు మైనారిటీలకు టికెట్లు ఖరారు చేసింది. ఆరు నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్లో నలుగురు పాతవారే.  మరో ఇద్దరు మాత్రం మొదటిసారి కొత్తగా పోటీ చేయబోతున్నారు.  పాతబస్తీలో అత్యధిక స్థానాల్లో ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తోంది ఇది అధికార బిఆర్ఎస్ కు మిత్రపక్షం అన్నసంగతి తెలిసిందే.

Latest Videos

undefined

సెల్ ఫోన్ దొంగిలించాడని అనుమానం.. కర్రలతో కొట్టి యువకుడి దారుణ హత్య.. ఆదిలాబాద్ లో ఘటన

పాతబస్తీ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఏమాత్రం లేకపోయినా ఎక్కువగా కసరత్తు చేయడం మీద ఆ రెండు పార్టీల మైత్రికి సంబంధించి వాదనలకు బలం చేకూరుస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. మలక్పేట్ నుంచి గతంలో చవ్వా సతీష్ పోటీ చేయగా ఈసారి తీగల అజిత్ రెడ్డికి బిఆర్ఎస్ టికెట్ ను ప్రకటించింది. దీంతో తీగల అజిత్ రెడ్డి మొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అజిత్ రెడ్డి భార్య సునరీత రెడ్డి మూసారాంబాగ్ కార్పొరేటర్ గా పనిచేశారు.

గతంలో మూడుసార్లు కార్పొరేటర్ గా పనిచేసిన ఐయిందాల కృష్ణయ్య  ఈసారి కార్వాన్ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. 2018 ఎన్నికల్లో 22వేలకు పైగా ఓట్లు సాధించిన సామ సుందర్ రెడ్డి.. యాకుత్పురా నుంచి మరోసారి ఎమ్మెల్యేగా బరిలో దిగబోతున్నారు.

2018లో చార్మినార్ నుంచి పోటీ చేసిన ఇబ్రహీం లోడికి మళ్లీ ఈసారి కూడా పోటీ చేయనున్నారు. ఇక చాంద్రాయణ గుట్ట నుంచి ఏం సీతారాంరెడ్డి,  బహుదూర్పురా నుంచి అలీ బక్రీ మళ్లీ బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరూ గతంలోనూ పోటీ చేసిన వారే. 

పాతబస్తీలో మజిలీస్ గెలుపు కోసం బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారని  గుసగుసలు వినిపిస్తున్నాయి. 29 నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో మజ్లిస్, 21 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్, ఒక్క స్థానంలో బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నారు. సోమవారం నాడు సీఎం కేసీఆర్ మాట్లాడిన దాన్నిబట్టి  టిఆర్ఎస్ అభ్యర్థులను మజ్లిస్ గెలుపు కోసమే ప్రకటించినట్లుగా తెలుస్తోంది.

ఇక ఇందులో కూడా నాంపల్లి, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ పెండింగ్లో పెట్టింది. దీనికి కారణం అక్కడ కాస్త బలంగా ఉన్న బిజేపీని నిలువరించడానికి ఇలా చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. బిజెపికి సిట్టింగ్ స్థానం గోషామహల్. ఇక్కడి నుంచి రాజాసింగ్ 2018 ఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. 

రాజాసింగ్ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా నందకిషోర్ వ్యాస్ ఉన్నారు. ఇక నాంపల్లికి వచ్చేసరికి అది ఎంఐఎంకు సిట్టింగ్ స్థానం. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బలంగా ఉన్నారు. అందుకే వీఆర్ఎస్ కు మిత్రపక్షమైన ఎంఐఎంకు మేలు చేసే అభ్యర్థిని వెతకడం కోసం ఈ స్థానాన్ని పెండింగ్లో పెట్టారని ప్రచారం జరుగుతోంది.

click me!