Hyderabad: హైదరాబాద్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు తమ్ముడి ముందే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎనిమిది మంది దుండగులు కత్తులతో బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Meerpet-Gang rape: హైదరాబాద్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు తమ్ముడి ముందే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎనిమిది మంది దుండగులు కత్తులతో బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన స్థానికులు, పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కొందరు దుండగులు తమ్ముడి ముందే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మీర్ పేట్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా గంజాయి బ్యాచ్ గా పిలువబడే పలువురితో కూడిన గుంపు ఒక ఇంట్లోకి ప్రవేశించి తమ్ముడి ముందరే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అత్యాచార బాధిత బాలికకు తల్లిలేదు. తండ్రి ఇటీవల మరొక పెళ్లి చేసుకోవడంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం నందనవనంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. అయితే, సోమవారం సాయంత్రం గంజాయి బ్యాచ్ గా పిలువబడే ఎనిమిది మందితో కూడిన గుంపు ఒక్కసారిగా బాలిక ఇంట్లోకి దూసుకొచ్చారు. తమ వద్దవున్న ఆయుధాలతో బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీని గురించి ఎవ్వరికీ చెప్పవద్దంటూ బెదిరించారు. ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారనీ, వారి కోసం గాలింపు కొనసాగుతున్నదని తెలిపారు.
ఇదిలావుండగా, ఢిల్లీలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుని మైనర్ కూతురిపై ఓ ప్రభుత్వ ఉద్యోగి లైంగికదాడికి పాల్పడ్డాడు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఢిల్లీ ప్రభుత్వ అధికారి ప్రేమోదయ్ ఖాఖా, అతని భార్య సీమా రాణిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నార్త్ డిస్ట్రిక్ట్ డీసీపీ సాగర్ సింగ్ కల్సీ తెలిపారు. వారిలో ఒకరు జీఎన్సీటీ మహిళా, శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రేమోదయ్ ఖాఖా (51), రెండో నిందితురాలు ఆయన భార్య సీమారాణి (50). తండ్రి చనిపోయిన తర్వాత నిందితుడు బాధితురాలికి స్థానిక సంరక్షకుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పలుమార్లు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.