అడవిలో చెట్టుకు వేలాడుతున్న స్నేహితులు.. హత్యా.. ఆత్మహత్యా..!?

Bukka Sumabala   | Asianet News
Published : Jan 13, 2021, 09:20 AM IST
అడవిలో చెట్టుకు వేలాడుతున్న స్నేహితులు.. హత్యా.. ఆత్మహత్యా..!?

సారాంశం

జీడిమెట్ల అడవిలో ఇద్దరు స్నేహితుల ఉరి కలకలం రేపింది. కనిపించకుండా పోయి చివరికి అడవిలో చెట్టుకు శవాలై వేలాడుతూ కనిపించారు స్నేహితులు. అయితే వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్నారా..? లేదా..? ఎవరైనా హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా..? అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

జీడిమెట్ల సీఐ బాలరాజు కథనం ప్రకారం.. గాజులరామారం గ్రామానికి చెందిన బండోజి సత్యనారాయణ కుమారుడు సాయికుమార్‌ (22) ఎలక్ట్రీషియన్‌ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 10 సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చిన సాయికుమార్‌ కొంచెం సేపటి తర్వాత బయటకు వెళ్లాడు. 

రాత్రైపోయినా కొడుకు ఇంటికి తిరిగి రాకపోవడంతో సత్యనారాయణ అందరినీ వాకబు చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన నరేష్‌ (22) ఫోన్‌ చేసి ‘మీ కొడుకు సాయికుమార్‌ నా తోనే ఉన్నాడు’ అని చెప్పి ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. 

అదే రోజు రాత్రి నరేష్‌ తన తల్లికి ఫోన్‌ చేసి అరగంటలో ఇంటికి వస్తున్నానని చెప్పాడు. కానీ వెళ్లలేదు. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో లాల్‌సాబ్‌గూడ ఫారెస్ట్ లో ఇద్దరు యువకులు చెట్టుకు వేలాడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. 

అక్కడికి వెళ్లిన పోలీసులు వారిని సాయికుమార్‌, నరేష్ గా గుర్తించారు. వారిద్దరు చీరలతో ఉరేసుకుని వేర్వేరు చెట్లకు వేలాడుతూ కనిపించారు. వీరి మృతికి గల కారణాలు తెలియలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి చీరలు ఎక్కడ నుంచి వచ్చాయి..? ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా..? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్