ఫ్రీ బస్ ఎఫెక్ట్.. సీటు కోసం భీకరంగా కొట్టుకున్న మహిళలు.. గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి

By Sairam Indur  |  First Published Jan 1, 2024, 5:44 PM IST

free bus for womens : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గొడవలకు కారణం అవుతోంది. జహీరాబాద్ జిల్లాలో బస్సులో సీటు కోసం మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. భీకరంగా పోరాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Mahalakshmi scheme : తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కిందట మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. అయితే ఈ పథకం ప్రారంభమైన దగ్గర నుంచి తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో సారి కూడా వార్తల్లోకి ఎక్కింది. బస్సులో సీటు కోసం పలువురు మహిళలు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారత్ లో కోవిడ్ కలకలం.. ఒకే రోజు 850 కొత్త కేసులు నమోదు.. ఏడు నెలల్లో ఇదే అత్యధికం..

Latest Videos

undefined

జహీరాబాద్‌ జిల్లాలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ముప్పై సెకన్ల క్లిప్‌లో పలువురు మహిళలు ఘోరంగా కొట్టుకున్నారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకున్నారు. వారి గొడవ చూసి బస్సులో ఉన్న చిన్నారి ఏడవడం మొదలుపెట్టింది. వారి మధ్య ఘర్షణను నివారించేందుకు ఇతర ప్రయాణికులు ప్రయత్నించారు. కొంత సమయం తరువాత ఆ గొడవ సద్దు మనిగింది.

న్యూ ఇయర్ రోజు జపాన్ లో భారీ భూకంపం.. సునామీ వచ్చే ఛాన్స్..

కాగా.. ఆ బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం మొదలైన తరువాత బస్సుల్లో రద్దీ పెరిగింది. ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ పెరుగుతోంది. గతంలో 69 శాతం ఉన్న ఈ రేషియో ఇప్పుడు 89 శాతానికి పెరిగిందని తెలుస్తోంది. గతంలో ఆర్టీసీ బస్సుల్లో 12 నుంచి 14 లక్షల మంది ప్రయాణిస్తుండగా.. ఇప్పుడు ఇప్పుడు 29 లక్షలకు చేరింది.

కస్టమర్లను కర్రలతో కొట్టిన రెస్టారెంట్ సిబ్బంది.. రాజాసింగ్ ఆగ్రహం.. వీడియో వైరల్

అయితే బస్సుల్లో మహిళలతో నిండిపోతుండటంతో పురుషులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆర్టీసీ అవసరమైన రూట్టల్లో, సమాయాలల్లో పురుషులకు ప్రత్యేక బస్సులు నడిపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోంది. అలాగే వృద్ధులకూ ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు గురించీ సమాలోచనలు చేస్తున్నది. దీంతో పాటు విద్యార్థుల సమస్యకూ పరిష్కారాన్ని వెతికే పనిలో ఉన్నది. వారు వెళ్లే మార్గంలో కొన్ని ప్రత్యేక సర్వీసులు నడుపాలా? అనే ఆలోచనలు చేస్తున్నది. దీనిపై ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.

click me!