పోలీస్ స్టేషన్ లో ఉరివేసుకున్న హెడ్ కానిస్టేబుల్

Published : Jan 30, 2020, 10:06 AM IST
పోలీస్ స్టేషన్ లో ఉరివేసుకున్న హెడ్ కానిస్టేబుల్

సారాంశం

బుధవారం ఉదయం డ్యూటీ ముగించుకొని 10గంటలకు ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం రెండు గంటలకు మళ్లీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లచ్చయ్య.. అక్కడ తన తోటి స్టాఫ్ తో కాసేపు ముచ్చటించాడు. ఓ అరగంట తర్వాత పోలీస్ స్టేషన్ వెనుక గదిలో  ఫ్యాన్ కి ఉరివేసుకున్నాడు.  


పోలీస్ స్టేషన్ లోనే ఓ హెడ్ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... జనగామ జిల్లా దేవురుప్పల కడవెల్లి గ్రామానికి చెందిన పంతం లచ్చయ్యగౌడ్(58) మూడు సంవత్సరాలుగా  కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో హెడ్  కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

కాగా.. బుధవారం ఉదయం డ్యూటీ ముగించుకొని 10గంటలకు ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం రెండు గంటలకు మళ్లీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లచ్చయ్య.. అక్కడ తన తోటి స్టాఫ్ తో కాసేపు ముచ్చటించాడు. ఓ అరగంట తర్వాత పోలీస్ స్టేషన్ వెనుక గదిలో  ఫ్యాన్ కి ఉరివేసుకున్నాడు.

Also Read భార్యను చంపి, రాత్రంతా శవం పక్కనే నిద్రించి...

ఇతర స్టాఫ్ వెళ్లి చూసేసరికి చనిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ లక్ష్మీనారాయణలు హుటాహుటినా ఘటనాస్థలిలకి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా... భర్త మరణవార్త తెలుసుకొని లచ్చయ్య భార్య కళ్లుతిరిగి పడిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే... లచ్చయ్య ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియడం లేదు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?