కూకట్‌పల్లిలో వెలుగులోకి క్రిప్టో కరెన్సీ మోసం.. బాధితుల ఆందోళన..

Published : Feb 15, 2023, 01:56 PM IST
కూకట్‌పల్లిలో వెలుగులోకి క్రిప్టో కరెన్సీ మోసం.. బాధితుల ఆందోళన..

సారాంశం

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో క్రిప్టో కరెన్సీ మోసం వెలుగుచూసింది. ప్రజల ఆశలను అసరాగా చేసుకుని ఓ సంస్థ మోసానికి పాల్పడింది.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో క్రిప్టో కరెన్సీ మోసం వెలుగుచూసింది. ప్రజల ఆశలను అసరాగా చేసుకుని ఓ సంస్థ మోసానికి పాల్పడింది. ఎక్స్‌సీఎస్‌పీఎల్ పేరుతో వసూళ్లకు పాల్పడింది. తమ దగ్గర పెట్టుబడి పెడితే మూడు నెలల్లో 4 రెట్ల లాభం ఇస్తామంటూ మోసం చేసింది. ఎక్స్‌సీఎస్‌పీఎల్ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేసింది. అయితే తాజాగా  తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు కేపీహెచ్‌బీలోని  ఎక్స్‌సీఎస్‌పీఎల్ సంస్థ ఎదుట బాధితులు ఆందోళన  చేపట్టారు. 

రూ. లక్ష కడితే రూ. 4 లక్షలు వస్తాయని ఆశచూపినట్టుగా బాధితులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కనీసం పెట్టుబడి కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభాలు వస్తాయని అప్పులు తెచ్చి మరి పెట్టుబడి  పెట్టామని బాధితులు వాపోతున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!