నలుగురు సీఎంలు , సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లు యాదగిరిగ్టుకు చేరుకున్నారు.
యాదగిరిగుట్ట: నలుగురు సీఎంలు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లు బుదవారం నాడు యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొనేందుకు వీరంతా వచ్చారు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఢిల్లీ, పంజాబ్ , కేరళ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్ లు నిన్న రాత్రే హైద్రాబాద్ కు వచ్చారు. ఈ ముగ్గురు సీఎంలు తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసంలో ఇవాళ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేశారు. ముగ్ఎంగురు సీఎంలతో పాటు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లు కూడ కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ భేటీలో పాల్గొన్నారు. బ్రేక్ ఫాస్ట్ ముగిసిన తర్వాత వీరంతాబేగంపేట విమానశ్రయం నుండి రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో యాదగిరిగుట్టకు చేరుకున్నారు.
యాదాద్రి ఆలయానికి చేరుకున్న తెలంగాణ, ఢిల్లీ సీఎం , పంజాబ్ సీఎంలు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ లు, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ల కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతను సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రులకు వివరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత స్వామివారి తీర్ధప్రసాదాలను సీఎంలు స్వీకరించారు.
గెస్ట్ హౌస్ లోనే విజయన్, డి. రాజా
యాదగిరిగుట్ట ఆలయంలో లక్ష్మీనరసింహస్వామిని ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లు దర్శించుకున్నారు. యాదాద్రికి వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజాలు మాత్రం గెస్ట్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యారు.
also read:ప్రగతి భవన్ లో మూడు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్: జాతీయ రాజకీయాలపై చర్చ
కేరళ సీఎం విజయన్ సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. డి. రాజా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కమ్యూనిష్టు పార్టీల్లో ప్రధాన నేతలుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు యాదాద్రికి చేరుకున్నా గెస్ట్ హౌస్ కి మాత్రమే పరిమితమయ్యారు. కేసీఆర్ సహా ఇతర నేతలు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత రెండు హెలికాప్టర్లలో కలిసి వీరంతా ఖమ్మం చేరుకుంటారు.