తప్పిన ప్రమాదం:ఆదిలాబాద్ లో వాగులో పడిన అంబులెన్స్

Published : Apr 06, 2023, 10:15 AM IST
తప్పిన ప్రమాదం:ఆదిలాబాద్ లో  వాగులో పడిన అంబులెన్స్

సారాంశం

డెడ్ బాడీని  తరలిస్తున్న అంబులెన్స్  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులో  పడింది.ఈ ప్రమాదంలో  అంబులెన్స్ లో  ఉన్న  నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. 

ఆదిలాబాద్: ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లాలోని  జైనథ్ మండలం  తరోడా వద్ద  వాగులో అంబులెన్స్ పడింది. ఈ ప్రమాదం నుండి అంబులెన్స్  లో  ఉన్న నలుగురు  సురక్షితంగా బయటపడ్డారు.  

జైనథ్  నుండి మహారాష్ట్రలోని నాందేడ్ వైపు అంబులెన్స్  వెళ్తున్న  సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్ లో మృతదేహన్ని  నలుగురు వ్యక్తులు తీసుకె
ళ్తున్నారు.ఈ సమయంలో  అంబులెన్స్ ప్రమాదవశాత్తు వాగులో పడిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు వెంటనే  పోలీసులకు సమాచారం ఇచ్చారు.  అంబులెన్స్  నుండి  పోలీసులు   నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు.  అంబులెన్స్ లో  ఉన్న మృతదేహం కోసం పోలీసులు గాలింపు  చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం