నల్గొండలో రోడ్డు ప్రమాదాలు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం..

Published : Dec 25, 2023, 07:50 AM ISTUpdated : Dec 25, 2023, 08:10 AM IST
నల్గొండలో రోడ్డు ప్రమాదాలు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం..

సారాంశం

నల్గొండలో జరిగిన వరుస ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  

నల్గొండ : నల్గొండ జిల్లా నిడమాపనూర్, వేంపాడు దగ్గర వరుస ప్రమాదాలు ఆరుగురిని బలి తీసుకున్నాయి. ఆదివారం రాత్రి బైక్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ వార్త తెలిపి వారిని చూడడానికి వస్తున్న బంధువుల ఆటోను ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో ఆటోలోని నలుగురు మృతి చెందారు. 

సోమవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్యాంకర్ ఢీ కొట్టింది. ఎదురుగా వస్తున్న ఆటోనే వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు మృతి చెందారు. మరో ముగ్గరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంగా పెద్దపుర మండలం పుల్వతండా వాసులుగా గుర్తించారు. ఈ వరుస ప్రమాదాలతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Konda Surekha: నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక అదిష్టానం ఇష్టం.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
Rain Alert: తెలంగాణలో వింత పరిస్థితి.. ఉదయం ఎండ రాత్రి వర్షం. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్