సూర్యాపేటలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం చోరీ: గాలింపు చేపట్టిన పోలీసులు

Published : Dec 15, 2022, 09:55 AM ISTUpdated : Dec 15, 2022, 12:34 PM IST
సూర్యాపేటలో  పోలీస్ పెట్రోలింగ్ వాహనం చోరీ: గాలింపు చేపట్టిన పోలీసులు

సారాంశం

 సూర్యాపేటలో  పోలీస్ పెట్రోలింగ్ వాహనం చోరీకి గురైంది. కొత్త బస్టాండ్  కు సమీపంలో  పార్క్ చేసిన ఈ వాహానాన్ని గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు.వాహనం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో  పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని గుర్తు తెలియని దండగులు చోరీ చేశారు.  జిల్లా కేంద్రంలోని  కొత్త  బస్టాండ్ వద్ద ఈ వాహనాన్ని నిలిపి ఉంచారు పోలీస్ సిబ్బంది.  ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు  పెట్రోలింగ్ వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు వస్తున్నారని గమనించి కోదాడ వద్ద పెట్రోలింగ్ వాహనాన్ని దుండగుడు వదిలి  పారిపోయాడు.  ఈ వాహనాన్ని ఎవరు ఎత్తుకెళ్లారనే విషయమై పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

గతంలో  కూడా  దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో  పోలీస్ పెట్రోలింగ్  వాహానాలను  దుండగులు చోరీ చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి.ఒడిశా రాష్ట్రంలోని రాయఘడ్ వద్ద పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని దుండగుడు అపహరించాడు.  ఈ విషయాన్ని గుర్తించిన  పోలీసులు దుండగుడిని అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఈ ఏడాది నవంబర్  ఐదో తేదీన  జరిగింది. బస్టాండులలో నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సులను  చోరీ చేసిన  తరహలోనే  పోలీస్ పెట్రోలింగ్  వాహనాన్ని చోరీ చేయడం ప్రస్తుతం  కలకలం రేపుతుంది. పోలీస్ వాహనాన్ని  చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

THROWBACK : అసెంబ్లీలో కేసీఆర్ Vs రేవంత్ రెడ్డి | KCR VS Revanth Reddy In Telangana Assembly
BIG BREAKING: మహిళా MLA అని కూడా చూడకుండా.. అసెంబ్లీ వద్ద తీవ్ర రచ్చ! 🚨