హైదరాబాద్‌లో గంట వ్యవధిలో మూడు రోడ్డు ప్రమాదాలు: నలుగురు మృతి

By narsimha lode  |  First Published Jul 30, 2023, 10:29 AM IST

హైద్రాబాద్ నగరంలో  ఇవాళ  మూడు రోడ్డు ప్రమాదాలు  జరిగాయి.ఈ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. 


హైదరాబాద్: నగరంలోని  ఆదివారం నాడు ఉదయం గంట వ్యవధిలో మూడు రోడ్డు ప్రమాదాలు చోటు  చేసుకున్నాయి.ఈ రోడ్డు ప్రమాదాల్లో  నలుగురు మృతి చెందారు. హైద్రాబాద్ ట్యాంక్ బండ్ పై  ఇవాళ  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ  కారు పూర్తిగా దెబ్బతింది.  ట్యాంక్ బండ్ పై  ఉన్న డివైడర్ ను కారు ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో  కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో  కారులోని వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.  అయితే  కారును వదిలి కారులోని వారు  వెళ్లిపోయారు. కారును అతివేగంగా నడపడం వల్లే  ఈ ప్రమాదం జరిగిందని  పోలీసులు అనుమానిస్తున్నారు.  

రంగారెడ్డి జిల్లాలోని  ఆరాంఘర్ వద్ద  జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఇద్దరు   మృతి చెందారు.  బైకర్ ను ఢీకొని  అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని గుద్దుకుని  ఆగిపోయింది.ఈ ప్రమాదంలో ఇద్దరు  మృతి చెందారు. హైద్రాబాద్ కుషాయ్ గూడలో డివైడర్ ను  కారు  ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  

Latest Videos

ఈ ప్రమాదాలకు అతి వేగంతో పాటు  మద్యం మత్తులో వాహనాలు నడపడం కూడ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మూడు రోడ్డు ప్రమాదాలపై  ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో  కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాలకు గల కారణాలపై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.  

హైద్రాబాద్ నగరంలో  ఇటీవల కాలంలో  రోడ్డు ప్రమాదాలు  జరుగుతున్నాయి.  రోడ్డు ప్రమాదాల నివారణకు  పోలీసులు, అధికారులు  అనేక  సూచనలు  చేస్తున్నారు. కానీ  రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదు.


 

click me!