నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

Published : Aug 10, 2022, 08:50 AM IST
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

సారాంశం

రోడ్లు రక్తమోడుతున్నాయి. ప్రతీరోజూ అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం నిజామాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరణించినవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం కొత్తపల్లి వద్ద కారు చక్రం టైర్ పేలి పల్టీ కొట్టింది. కారు డివైడర్ అవతల పడిపోయింది. 

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ఉన్నారు. వారు హైదరాబాద్ నుంచి నిర్మల్ కు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారు హైదాబాద్ లోని టోలిచౌకి వాసులుగా భావిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ముప్కాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Birbhum Road Accident: బెంగాల్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 9 మంది దుర్మ‌ర‌ణం..

ఇదిలా ఉండగా, సోమవారం ప్రకాశం జిల్లా కంభం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓ కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  మృతులను  పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం  సిరిగిరిపాడు వాసులుగా గుర్తించారు. మృతుల్లో  అనిమిరెడ్డి ( 60), గురవమ్మ ( 60), ఆదిలక్ష్మి( 58), నాగిరెడ్డి (24)  ఉన్నారు.  సమాచారం అందుకున్న పోలీసులు లు హుటాహుటిన  సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం  దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Holiday : ఈసారి లాంగ్ వీకెండ్.. వరుసగా మూడ్రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?