కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన లారీ, ఆరుగురు మృతి

Published : Jul 18, 2022, 05:07 PM ISTUpdated : Jul 18, 2022, 05:40 PM IST
 కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన లారీ, ఆరుగురు మృతి

సారాంశం

కామారెడ్డి జిల్లాలో సోమవారం నాడు  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. 

మద్నూర్:  Kama Reddy  జిల్లాలో సోమవారం నాడు జరిగిన Road Accident లో ఆరుగురు మరణించారు.  జిల్లాలోని Madnoor మండలం మెనూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు  మృతి చెందారు. Auto ను Lorry  ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. 161 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకొంది.లారీ ముందు భాగంలోకి ఆటో వెళ్లింది. 

ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్నట్టుగా పోలీసులు చెప్పారు.ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో తొమ్మిది మంది ప్రయాణీకులున్నారు. ఈ ప్రమాదంతో ఆటో నుజ్జునుజ్జైంది. ఆటోలో ఉన్న వారెవరూ కూడా బతికే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు.  అతి కష్టం మీద ఆటోను లారీ ముందు భాగం నుండి బయటకు తీశారు.  మృతులు మహారాష్ట్రకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైద్రాబాద్ నుండి లారీ గుజరాత్ వైపునకు వెళ్తుంది. మద్నూర్ నుండి బిచ్కుంద వైపు ఆటో వెళ్తోంది. అయితే ఆటో రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?