క్లౌడ్ బరస్ట్ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తప్పు బట్టారు. ఈ వ్యాఖ్యలు సరికావన్నారు. క్లౌడ్ బరస్ట్ అంటే నిరంతరాయంగా వర్షాలు కురవవని చెప్పారు
హైదరాబాద్: Cloud Burst వల్ల నిరంతరాయంగా వర్షాలు రావని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.
సోమవారం నాడు హైద్రాబాద్ లోని BJP కార్యాలయంలో Konda Vishweshwar Reddy మీడియాతో మాట్లాడారు. క్లౌడ్ బరస్ట్ తో కొన్ని గంటల పాటు మాత్రమే వర్షం కురుస్తుందన్నారు. కానీ నిరంతరాయంగా వర్షాలు రావన్నారు. అంతేకాదు పరిమిత ప్రాంతంలోనే అసాధారణ వర్షపాతం నమోదు కానుందన్నారు. కానీ రాష్ట్రం మొత్తం భారీ వర్షం నమోదు కావడం క్లౌడ్ బరస్ట్ కిందకు రాదని ఆయన అభిప్రాయపడ్డారు. క్లౌడ్ బరస్ట్ విషయమై సీఎం కేసీఆర్ మరింత సమాచారంతో మాట్లాడితే ప్రయోజనంగా ఉంటుందన్నారు.
undefined
వరద బాధితులను ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. GHMC ఎన్నికలకు ముందు నగరంలో వచ్చిన భారీ వర్షాలతో ముంపునకు గురైన బాధిత ప్రజలకు రూ. 10 వేల ఆర్ధిక సహాయం ఇస్తామని KCR హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే కానీ కొందరికి మాత్రమే రూ. 10 వేల ఆర్ధిక సహాయం అందిన విషయాన్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.
Godavari Flood ముంపు బాధితులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు పరామర్శించారు. భద్రాచలంలో ముంపు బాధితులను పునరావాస కేంద్రంలో పరామర్శించారు. భద్రాచలంలో వరద ముంపు రాకుండా శాశ్వత పరిష్కారం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముంపు బాధితులకు ప్రత్యేక కాలనీలను నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అంతేకాదు గోదావరి నది పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగిందనే అనుమానాలను వ్యక్తం చేశారు. దీని వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందన్నారు. గతంలో కూడా జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ , ఉత్తరాఖండ్ లో ఈ తరహా క్లోడ్ బరస్ట్ జరిగిందన్నారు. తాజాగా గోదావరి నదిపై క్లోడ్ బరస్ట్ పై కుట్రలు చేశారనే అనుమానం వ్యక్తం చేశారు.
also read:భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు, క్లౌడ్ బరస్ట్ అనుమానాలు: కేసీఆర్
సీఎం కేసీఆర్ క్లోడ్ బరస్ట్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. తన తప్పులను కప్పి పుచ్చుకొనేందుకు కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. క్లౌడ్ బరస్ట్ పై విదేశీ శక్తులు కుట్రలు చేశాయనే సమాచారాన్ని కేంద్రానికి ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. క్లోడ్ బరస్ట్ పై కేసీఆర్ వ్యాఖ్యలను ఆర్డర్ తప్పి చేసిన వ్యాఖ్యలుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.