నిమ్స్ ఆసుపత్రిలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. నలుగురు వైద్యులతో పాటు ముగ్గురు ల్యాబ్ సిబ్బందికి కరోనా సోకిందని అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. నలుగురు వైద్యులతో పాటు ముగ్గురు ల్యాబ్ సిబ్బందికి కరోనా సోకిందని అధికారులు ప్రకటించారు.
నిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బందికి కరోనా సోకడంతో కలకలం రేపుతోంది. గాంధీ ఆసుపత్రిని కేవలం కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స చేసేందుకు ప్రభుత్వం కేటాయించింది.
undefined
also read:కొత్తగా 99 మందికి పాజిటివ్, నలుగురి మృతి: తెలంగాణలో 3 వేలకు చేరువలో కరోనా కేసులు
నిమ్స్ లో పనిచేసే వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. ఈ నలుగురు వైద్యులు, ముగ్గురు సిబ్బందితో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. కరోనా సోకిన వారిని క్వారంటైన్ కు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరో వైపు కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి వారిని కూడ క్వారంటైన్ కు తరలించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాటికి కరోనా కేసులు 2891కి చేరుకొన్నాయి. మంగళవారం నాడు కొత్తగా 99 కేసులు నమోదయ్యాయి.
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 80కి పైగా నమోదౌతున్నాయి. దేశ వ్యాప్తంగా కూడ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలను దాటాయి.