మృతుల కుటుంబాలకు పరిహారం కోసం ఆందోళన: గోదావరిఖని ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Jun 3, 2020, 11:37 AM IST
Highlights

 ప్రమాదంలో మరణించిన సింగరేణి కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు కార్మికులు.


గోదావరిఖని: ప్రమాదంలో మరణించిన సింగరేణి కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు కార్మికులు.

పెద్దపల్లిజిల్లా రామగుండంలోని సింగరేణి ఓసీపీ-1 గనిలోని ఫేజ్-2లో మంగళవారం నాడు భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

గనిలో మట్టిని తొలగించేందుకు పేలుడు పదార్ధాలను నింపే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో బండారి ప్రవీణ్, బిల్ల రాజేశం, బండ అర్జయ్య, రాకేష్ మరణించారు.

మృతదేహాలను గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. ఈ నలుగురు మరణించి 24 గంటలు దాటినా కూడ పోస్టుమార్టం పూర్తి చేయకపోవడంపై సింగరేణి కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు కోటి రూపాయాల పరిహారం చెల్లించాలని  కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మృతులకు సంతాపంగా సింగరేణి కార్మికులు ఇవాళ విదులను బహిష్కరించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ  కార్మికులు ఆందోళనకు దిగాయి. దీంతో పెద్దపల్లి ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

అధికారుల నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్మికుల మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించకుండా ఆలస్యం చేయడంపై కూడ కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

click me!