
హైదరాబాద్ : Telangana Police Departmentను Corona virus
కలవరపెడుతోంది. పలు పోలీస్ స్టేషన్ లలో సిబ్బందికి covid 19 positve గా నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా Third wave లో సుమారు 500మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. మొదటి దశలో 2,000మందికి పోలీసులకు కోవిడ్ సోకింది. రెండో దశలో 700మందికి పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.
50 మంది సిబ్బంది మృతి చెందారు. మూడు కమిషనరేట్ ల పరిధిలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో అధికారులు పోలీస్ స్టేషన్ లలో కోవిడ్ నిబంధలను పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. బూస్టర్ డోస్ ను సైతం వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హోమ్ గార్డ్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు బూస్టర్ డోసు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇదిలా ఉండగా, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల మీద నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. telanganaలో carona cases భారీగా పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో రోజువారీ నమోదవుతున్న కేసులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో CM KCR అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సోమవారం భేటీ కానుంది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు cabinet meeting జరగనుంది.
విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు.. వాటి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలే మెయిన్ అజెండాగా సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రోజుకు దాదాపు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలకు Sankranthi Holidays పొడిగించారు. ఆరోగ్య శాఖ సూచన మేరకు జనవరి 30 వరకు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
మరి రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు night curfew అమలు చేస్తున్నాయి. వీకెండ్ లో lockdown కూడా విధిస్తున్నాయి. ఇక మల్టీప్లెక్స్, థియేటర్ల విషయంలోనూ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. పలు చోట్ల కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమా హాళ్లు నడుస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
దీంతో నేడు జరగబోయే కేబినెట్ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. నేటి కేబినెట్ సమావేశంలో ఈ దిశగా కీలక నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. బూస్టర్ డోసులు,15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు టీకాలు కూడా ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా పలు మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.
ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమర్పించిన నివేదికపై చర్చించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే లాక్ డౌన్ విధించే అవకాశాలపై సైతం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.