బ్రేకింగ్: డ్రైవర్‌కు కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్‌లో కవిత కుటుంబం

By Siva Kodati  |  First Published Jul 23, 2020, 9:42 PM IST

తెలంగాణ సీఎం కుమార్తె, టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కవితతో పాటు ఆమె కుటుంబం మొత్తాన్ని అధికారులు హోమ్ ఐసోలేషన్‌లో ‌ఉంచారు


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మొదట్లో పదుల సంఖ్యలో వెలుగు చూసిన కేసులు ఇప్పుడు రోజుకు వేల సంఖ్యకు చేరుకుంటున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కోవిడ్ బాధితులుగా మారుతున్నారు.

రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల వద్ద పనిచేసే సిబ్బందిలో ఎవరైనా పాజిటివ్‌గా తేలితే చాలు నేతాశ్రీలు వణికిపోతున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కుమార్తె, టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.

Latest Videos

Also Read:తెలంగాణలో 50 వేలు దాటిన కేసులు: కొత్తగా 1,567 మందికి పాజిటివ్.. 9 మరణాలు

దీంతో కవితతో పాటు ఆమె కుటుంబం మొత్తాన్ని అధికారులు హోమ్ ఐసోలేషన్‌లో ‌ఉంచారు. వారం నుంచి పది రోజుల పాటు కవిత కుటుంబం ఇంటికే పరిమితం కానుంది.

మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు 50 వేలు దాటాయి. గురువారం కొత్తగా 1,567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50,826కి చేరింది.

ఇవాళ వైరస్‌తో 9 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 447కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 39,327 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Also Read:కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైంది, జర భద్రం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

హైదరాబాద్‌లో ఇవాళ ఒక్కరోజు 662 కేసులు నమోదవ్వగా.. రంగారెడ్డి 213, మేడ్చల్ 33, వరంగల్ అర్బన్ 75, సిరిసిల్ల 62, మహబూబ్‌నగర్ 61, నల్గొండ 44, సూర్యాపేట 39, కరీంనగర్ 38, నిజామాబాద్ 38, సంగారెడ్డి 32, భూపాలపల్లి 25, వరంగల్ రూరల్ 22, జనగాం 22, మహబూబాబాద్ 18, ఆదిలాబాద్ 17, ములుగు 17, జగిత్యాల 14, సిద్ధిపేట 9, వికారాబాద్ 5, ఆసిఫాబాద్ 4, పెద్దపల్లి, భద్రాద్రి, గద్వాలలో రెండేసి కేసులు, మంచిర్యాల, నిర్మల్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి. 

click me!