టీఆర్ఎస్ లో చేరిన ఎల్ రమణ..

Published : Jul 12, 2021, 01:03 PM IST
టీఆర్ఎస్ లో చేరిన ఎల్ రమణ..

సారాంశం

కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ రమణ, టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణకు కేటీఆర్ తో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. 

తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ గులాజీ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. 

కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ రమణ, టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణకు కేటీఆర్ తో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇటీవలె తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

రేపు టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం.. 16న కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్న ఎల్ రమణ

కాగా, టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ సోమవారం టీఆర్ఎస్  పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోనున్నారు. ఆయనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు. అనంతరం ఈ నెల 16న సహచరులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరనున్నారు ఎల్ రమణ. 

కాగా, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎల్. రమణ రాజీనామా చేశారు.  త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. గురువారం నాడు సీఎం కేసీఆర్ తో ఎల్. రమణ భేటీ అయ్యారు. తన రాజీనామా పత్రాన్ని శుక్రవారం నాడు చంద్రబాబునాయుడుు పంపారు రమణ. కొంత కాలంగా టీడీపీని వీడి  టీఆర్ఎస్ లో చేరాలని ఎల్. రమణ భావిస్తున్నారు. రమణతో  తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  పలు దఫాలుగా చర్చలు జరిపారు.ఈ చర్చలు ఫలవంతమయ్యాయి. దయాకర్ రావు దగ్గరుండి గురువారంనాడు రమణను  కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu