ములుగు జిల్లాలో ఓ గ్రామానికి ఐదేళ్లు సర్పంచ్‌గా వ్యవహరించిన కొర్సా రమేష్ ఉన్నట్టుండి సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. బంధువులను వాకబు చేసినా.. తమ దగ్గరకు రాలేదని వివరించారు. దీంతో కొర్సా రమేష్‌ను మావోయిస్టులే అపహరించికుని తీసుకు వెళ్లిపోయారని ఆమె భార్య రజిత అనుమానిస్తున్నారు. అందుకే మావోయిస్టుల కోసం విజ్ఞప్తులు చేస్తున్నారు.
హైదరాబాద్: ములుగు(Mulugu) జిల్లాలో ఆయన సర్పంచ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అయితే, ఆయన సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. బంధువులను వాకబు చేసినా.. తమ దగ్గరకు రాలేదని తెలిపారు. దీంతో తన భర్తను మావోయిస్టు(Maoists)లే కిడ్నాప్ చేసి ఉంటారని భార్య అనుమానిస్తున్నారు. తన భర్త అమాయకుడని, ఎవరికీ ఎలాంటి అపాయం కూడా చేయలేదని అన్నారు. ఒక వేళ ఏదైనా తప్పు చేసి ఉన్న పెద్ద మనసు చేసుకుని వదిలి పెట్టాని వేడుకున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే.. తాను, తమ ఇద్దరు పిల్లలు ఆగం అవుతారని విజ్ఞప్తులు చేస్తున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి 2013 నుంచి 2018 వరకు కొర్సా రమేష్ సర్పంచ్(Former Sarpanch)గా బాధ్యతలు చేపట్టారు. ఆయన భార్య రజిత ఏటూరునాగారం మండలంలో వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా పని చేస్తున్నారు. వీళ్ల కుటుంబం కొన్నేళ్లుగా ఏటూరునాగారంలో నివాసం ఉంటున్నది. మావోయిస్టుల ప్రభావం ఉన్న ఏరియా కావడంతో ఆయన భార్య రజిత మావోయిస్టుల చర్యలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
undefined
Also Read: TSRTC: ములుగు జిల్లాలో అర్ధరాత్రి ఆర్టిసి బస్సు దగ్దం... మావోయిస్టుల పనేనా?
ఉన్నట్టుండి సోమవారం సాయంత్రం నుంచి కొర్సా రమేష్ ఆచూకీ కనిపించకుండా పోయింది. ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. భద్రతాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లినట్టు భావించారు. కానీ, వారిని సంప్రదించగా తమ వద్దకు రాలేదని సమాధానం ఇచ్చారు. దీంతో మావోయిస్టులే తన భర్తను కిడ్నాప్ చేసి ఉంటారని భార్య రజిత సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన భర్త గురించి ఆమె మావోయిస్టులను వేడుకున్నారు. తన భర్త అమాయకుడని, ఎవరికీ ఏ పాపం చేయలేదని ఆమె పేర్కొన్నారు. ‘ఒక వేళ ఆయన ఏదైనా తప్పు చేసినా, లేదా మీరు చెప్పిన పని చేయకున్నా దయచేసి ఆయనను మన్నించి వదిలేయండి. ఆయనకు ఏ అఘాయిత్యం చోటుచేసుకున్నా.. తాను, తన ఇద్దరు చిన్న పిల్లల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయి’ అని పేర్కొన్నారు.
ఈ ఘటనపై పోలీసులూ స్పందించారు. వెంకటాపురం (నూగూరు) సీఐ శివ ప్రసాద్ స్పందించారు. రమేష్అద్యశ్యం వాస్తవేమనని, ఆయన ఆచూకీ కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అయితే, మావోయిస్టులే కొర్సా రమేష్‌ను అరెస్టు చేశారని చెప్పడానికి స్పష్టమైన సమాచారం లేదని వివరించారు.
Also Read: Maoists: వారం రోజుల తర్వాత సబ్ ఇంజనీర్‌ను విడిచిపెట్టిన మావోయిస్టులు
తెలంగాణ ఆర్టిసి (TSRTC)కి చెందిన బస్సును గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ములుగు జిల్లా (mulugu district)లో ఈ నెలలోనే చోటుచేసుకుంది. రాత్రి సమయంలో నిలిపివుంచిన బస్సుకు దుండగులు నిప్పంటించి పరారయ్యారు. అయితే స్థానికులు మంటలను గమనించి ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కాలిపోయిన బస్సును పరిశీలించారు. బస్సుకు నిప్పుపెట్టిన వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు. ఇది ఆకతాయిల పనా...? లేక మావోయిస్టుల (maoists) దుశ్చర్యా..? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. ఇక్కడ మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో ఆర్టిసి బస్సు దహనం మావోయిస్టుల పనేమో అన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.