‘ఏమైంది.. ఎలా ఉంది హన్మంత్’.. వీ.హెచ్. కి సోనియా పరామర్శ..

Published : Jul 01, 2021, 02:56 PM IST
‘ఏమైంది.. ఎలా ఉంది హన్మంత్’.. వీ.హెచ్. కి సోనియా పరామర్శ..

సారాంశం

మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు కు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేశారు. హనుమంతరావు ఆరోగ్యం గురించి వాకబు చేశారు. 

మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు కు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేశారు. హనుమంతరావు ఆరోగ్యం గురించి వాకబు చేశారు. 

‘ఏమైంది.. ఎలా ఉంది హన్మంత్’ అని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సోనియాగాంధీ. దీనికి హనుమంతరావు సమాధానం ఇస్తూ.. కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిందని.. ఇంతకు ముందు కరోనా వచ్చిందని..  ఇప్పుడు కాస్త బాగుందని చెప్పుకొచ్చారు.

జీవితం చాలా ముఖ్యమైంది.. ఆరోగ్యం కాపాడుకోవాలని సోనియా సూచించారు. దీనికి మీ ఆశీస్సులు కావాలని వి.హెచ్..  కోరారు. మీరు నా మనిషి, కాంగ్రెస్ మనిషి మీరు బాగుండాలని కోరుకుంటున్న అని సోనియా సమాధానం ఇచ్చారు. 

నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ వి.హెచ్ కు కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సోనియా గాంధీకి, కేసి వేణుగోపాల్ కు వి.హెచ్ ధన్యవాదాలు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu