జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్ సభ: భట్టి, ఠాక్రే భేటీలో పాల్గొన్న పొంగులేటి

By narsimha lode  |  First Published Jun 28, 2023, 4:23 PM IST

ఖమ్మంలో  జూలై  రెండో తేదీన  కాంగ్రెస్ సభపై  సీఎల్పీ నేత  మల్లు భట్టి విక్రమార్కతో  పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రే భేటీ అయ్యారు.  ఈ సమావేశంలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడ పాల్గొన్నారు.


ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  నాయకన్ గూడెంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారా ఇంచార్జీ మాణిక్ రావుతో జరిగిన  సమావేశానికి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

ఈ ఏడాది జూలై  రెండో తేదిన  ఖమ్మంలో  కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించనుంది.  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క   పాదయాత్ర ముగింపును  పురస్కరించుకొని  ఖమ్మంలో   సభను  నిర్వహిస్తున్నారు. ఈ సభలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తన అనుచరులతో  కాంగ్రెస్ పార్టీలో  చేరే అవకాశం ఉంది. 

Latest Videos

ఈ ఏడాది ఏప్రిల్  10వ తేదీన  బీఆర్ఎస్ నాయకత్వం  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  మాజీ మంత్రి  జూపల్లి  కృష్ణారావుపై  సస్పెన్షన్ వేటు వేసింది.  దీంతో ఈ ఇద్దరు  నేతలను  తమ పార్టీల్లోకి చేర్చుకోవాలని బీజేపీ, కాంగ్రెస్  కీలక నేతలు  పలు దఫాలు  చర్చలు జరిపారు.   పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు  కాంగ్రెస్ పార్టీలో  చేరేందుకు  ఆసక్తిని  చూపుతున్నారు.  మల్లు భట్టి విక్రమార్క  పాదయాత్ర ముగింపు సభలోనే  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  కాంగ్రెస్ లో  చేరనున్నారు. ఖమ్మం  సభ విషయమై  భట్టి విక్రమార్కతో  మాణిక్ రావు ఠాక్రే , ఎఐసీసీ సెక్రటరీ  రోహిత్ చౌదరితో చర్చించారు.ఖమ్మం  సభకు జన సమీకరణ, సభలో  ప్రకటించాల్సిన అంశాలపై  చర్చించారు. మరో వైపు  సభ విజయవంతం  విషయమై  చర్చించారు.  

also read:జూలై 2న ఖమ్మంలో సభ: భట్టితో మాణిక్ రావు ఠాక్రే భేటీ

ఈ సమావేశానికి  హాజరైన  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాణిక్ రావు ఠాక్రే,  రోహిత్ చౌదరి,  భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్  సహా ఇతర నేతలకు శాలువాలు కప్పారు.  ఖమ్మంలో  ఏ ప్రాంతంలో  సభ నిర్వహించాలి,  ఏ ప్రాంతంలో  సభ నిర్వహణకు  అనుకూలంగా ఉంటుందనే  విషయమై  నేతలు  చర్చించారు.
 

click me!