కాంగ్రెస్ ఎన్నికల కమిటీలు: అలిగిన అంజన్ కుమార్ యాదవ్

By narsimha lodeFirst Published Nov 18, 2020, 1:44 PM IST
Highlights

ఎన్నికల కమిటీల ఏర్పాటుపై తనకు సమాచారం ఇవ్వకపోవడంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ హైద్రాబాద్ నగర కమిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నాయకత్వంపై  అలిగిన అంజన్ కుమార్ యాదవ్ గాంధీ భవన్ కు దూరంగా ఉన్నారు.

హైదరాబాద్: ఎన్నికల కమిటీల ఏర్పాటుపై తనకు సమాచారం ఇవ్వకపోవడంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ హైద్రాబాద్ నగర కమిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నాయకత్వంపై  అలిగిన అంజన్ కుమార్ యాదవ్ గాంధీ భవన్ కు దూరంగా ఉన్నారు.

ఎన్నికల కమిటీల ఏర్పాటు విషయమై పార్టీ నాయకత్వంపై అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. అయితే ఈ కమిటీకి సంబంధం లేకుండా అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు అంజన్ కుమార్ యాదవ్  ప్రయత్నిస్తున్నారు.

also read:మాజీ ఎమ్మెల్యే బిక్షపతికి బుజ్జగింపులు: యాదవ్ ఇంటికి ఉత్తమ్, కొండా

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే షాక్ లపై షాక్ లు తగులుతున్నాయి. మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బీజేపీలో చేరనున్నారు. 

శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కూడ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్  అలగడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
 

click me!