మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలి: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి గోనె ప్రకాష్ రావు లేఖ

By narsimha lode  |  First Published Oct 27, 2022, 5:20 PM IST

మునుగోడు ఉప ఎన్నికను రద్దు  చేయాలని  మాజీ  ఎమ్మెల్యే  గోనె ప్రకాష్ రావు  తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా  డబ్బులు  ఖర్చు చేస్తున్నారని  ఆ లేఖలో  ఆయన ఆరోపించారు.


హైదరాబాద్: మునుగోడు ఉప  ఎన్నికను రద్దు చేయాలని  కోరుతూ  మాజీ  ఎమ్మెల్యే గోనె  ప్రకాష్ రావు  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  వికాస్  రాజ్ కి  గురువారం నాడు లేఖ రాశారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు  రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు  ఖర్చు చేస్తున్నాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. మరో  వైపు  ప్రత్యర్ధులపై అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తున్నారని  ఆ లేఖలో ఆయన చెప్పారు.

Latest Videos

undefined

మునుగోడు  ఎమ్మెల్యే పదవికి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ  ఏడాది ఆగస్టు  8వ  తేదీన  రాజీనామా చేశారు. దీంతో మునుగోడు అసెంబ్లీ  స్థానానికి ఉప ఎన్నిక  అనివార్యంగా  మారింది.  ఎమ్మెల్యే పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే  రాజగోపాల్  రెడ్డి  కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే  నెల  21న  కోమటిరెడ్డి  రాజగోపాల్  రెడ్డి  బీజేపీలో  చేరారు. 

మునుగోడు అసెంబ్లీ స్థానానికి  ప్రస్తుతం జరుగుతున్న ఉప  ఎన్నికల్లో  కాంగ్రెస్  అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి,  టీఆర్ఎస్ అభ్యర్థిగా  కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా  కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి బరిలోకి దిగారు. ఈ మూడు  పార్టీలు ఈ  ఎన్నికను  సీరియస్  గా తీసుకున్నాయి. టీఆర్ఎస్ కు లెఫ్ట్  పార్టీలు  మద్దతును  ప్రకటించాయి.మునుగోడు అసెంబ్లీ  స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  మొత్తం  47 మంది  అభ్యర్ధులు బరిలో  నిలిచారు.మునుగోడు ఉప  ఎన్నికలను  వచ్చే  అసెంబ్లీ  ఎన్నికల్లో వచ్చే ఫలితాలకు సెమీ  ఫైనల్ గా భావిస్తున్నారు. దీంతో  ప్రధాన పార్టీలు ఈ  ఎన్నికను ప్రతిష్టాత్మకంగా  తీసుకున్నాయి.

also  read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు: ముగ్గురిని కోర్టులో హాజరు పర్చనున్న పోలీసులు

నిన్న మొయినాబాద్ ఫాం హౌస్ లో  ఎమ్మెల్యేలకు  ప్రలోభాల అంశం  కూడ చర్చకు దారి తీసింది., ఈ ప్రలోభాల వెనుక  బీజేపీ  ఉందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ  ఖండించింది. దీని   ప్రగతి భవన్  డైరెక్షన్  లోనే కొత్త డ్రామాకు  తెర తీశారని బీజేపీ  ఆరోపించింది.  ఈ విసయమై   ప్రత్యేక  బృందంతో  విచారణ  కోరుతూ  హైకోర్టులో  బీజేపీ  పిటిషన్  దాఖలు చేసింది.

click me!