‘నన్ను బదనామ్ చేస్తారా? మీ రాసలీలలు బయటపెడతా..’ కొప్పుల ఈశ్వర్ కు గోనె ప్రకాశ్ వార్నింగ్...

By SumaBala BukkaFirst Published Jan 5, 2022, 1:28 PM IST
Highlights

‘నేను దళిత వ్యతిరేకిని కాదు.. నన్ను కొప్పుల ఈశ్వర్, అతని అనుచరులు బదనామ్ చేస్తున్నారు’ అని మండిపడ్డారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రామగుండం కార్పొరేషన్ అవినీటి మయంగా మారిందని రామగుండం మేయర్ ను దించేవరకు పోరాటం చేస్తానని గోనె ప్రకాశ్ రావు స్పష్టం చేశారు. 

పెద్దపల్లి : మంత్రి Koppula Ishwar, ఎమ్మెల్యే Chander మీద మాజీ ఎమ్మెల్యే Gone Prakash Rao సంచలన వ్యాఖ్యలు చేశారు. సలహాలు ఇస్తే తనను దళిత ద్రోహిగా చిత్రీకరిస్తున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ రాసలీలలు త్వరలో బయటపెడతానని తెలిపారు. రామగుండలో ఇసుక, బూడిద, మాఫియాలో ప్రజాప్రతినిధుల హస్తం ఉందని ఆరోపించారు.

‘నేను దళిత వ్యతిరేకిని కాదు.. నన్ను కొప్పుల ఈశ్వర్, అతని అనుచరులు బదనామ్ చేస్తున్నారు’ అని మండిపడ్డారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. Ramagundam Corporation అవినీతి మయంగా మారిందని రామగుండం మేయర్ ను దించేవరకు పోరాటం చేస్తానని గోనె ప్రకాశ్ రావు స్పష్టం చేశారు. 

అంతకుముందు కూడా గోనె ప్రకాశ్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిలల మీద కూడా చేశారు. నిరుడు జూన్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిమానుల పేరిట కొంత మంది తనను బెదిరిస్తున్నారని, ఇదే విధంగా బెదిరింపులు కొనసాగితే జగన్ బండారం బయటపెడుతానని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాజకీయ నేత గోనే ప్రకాశ్ రావు చెప్పారు. 

కేసీఆర్ తెలంగాణ గాంధీ... ముట్టుకుంటే షాక్ తప్పదు..: నడ్డాకు జీవన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

విదేశాల్లో కూర్చుని తనపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, దమ్ముంటే వారు తన ముందుకు చర్చకు రావాలని ఆయన అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనకు, వైఎస్ పాలనకు మధ్య నక్కకు నాకలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని, విజయసాయి రెడ్డి ఫైనాన్స్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

సిఎం జగన్ అక్రమాస్తులపై నమోదైన సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ రద్దు కావడం ఖాయమని ఆయన అన్నారు. జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని ఆయన ఆరోపించారు. 

వైఎస్ పాదయాత్రలో జగన్ పాల్గొనలేదని ఆయన చెప్పారు. నాలో... నాతో వైఎస్సార్ పుస్తకంలో తండ్రికి అండగా జగన్ పాదయాత్ర చేశారని విజయమ్మ రాయడాన్ని ఆయన తప్పు పట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో తాను, తిరుపతి ప్రస్తుత ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రారంభం నుంచి చివరకు ఉన్నామని ఆయన చెప్పారు. 

మార్చి 3న వైఎస్ షర్మిల పెడుతున్న సందర్భంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.  వైఎస్ కుటుంబంలో చోటు చేసుకున్న తగాదాల కారణంగానే వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నారని  వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

షర్మిలకు వైఎస్ జగన్ లోకసభ సీటు గానీ రాజ్యసభ సీటు గానీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. కుటుంబంలో ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం బాటలోనే షర్మిల పార్టీ నడుస్తుందని ఆయన అన్నారు. 

గతంలో చిరంజీవి పార్టీ వల్ల అమాయకులు బలయ్యారని, చాలా మంది భూములు అమ్మి సర్వం కోల్పోయారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు షర్మిల పార్టీ కూడా అదే దారిలో నడుస్తోందని అన్నారు. ఇలా పార్టీలు పెట్టి ఇతరులను ముంచవద్దని ఆయన షర్మిలకు సలహా ఇచ్చారు. 

click me!