హీరో నాగశౌర్య ఫామ్ హౌజ్‌పై పోలీసుల దాడులు.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..

Published : Nov 01, 2021, 12:18 PM ISTUpdated : Nov 01, 2021, 04:18 PM IST
హీరో నాగశౌర్య  ఫామ్ హౌజ్‌పై పోలీసుల దాడులు..  మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..

సారాంశం

హైదరాబాద్‌ శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న..  కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ వీకెండ్ లో భారీ ఎత్తున పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. 

హైదరాబాద్‌ శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న..  కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ వీకెండ్ లో భారీ ఎత్తున పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ప్రతివారం ఇక్కడకు బడా బాబులు వచ్చి పేకాటలో తమ అదృష్టం పరీక్షించుకుంటారని తెలుస్తుంది. అయితే  అరెస్ట్  అయినవారిలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య కూడా ఉన్నారు. ఆయన మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతేకాకుండా నిందితుల్లో పలువురు  ప్రముఖులు కూడా ఉన్నట్టుగా సమాచారం. అయితే Naga shaurya ఫార్మ్ హౌస్ లో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోవడం సంచలనం రేపుతోంది. 

ఇక, పేకాట ఆడిస్తున్న గుత్తా సుమన్‌కుమార్‌ పోలీసులకు దొరికిపోయాడు. గుత్తా సుమన్‌కుమార్ హైదరాబాద్‌లో పలుచోట్ల క్యాషినో ఆడిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇందులో  భాగంగానే ఫామ్‌హౌస్‌లు అద్దెకు తీసుకుని పేకాట ఆడిస్తున్నాడు. అంతేకాకుండా హైదరాబాద్‌లో సుమన్ కుమార్ చాలా మందిని మోసం చేసినట్టుగా తెలుస్తోంది. ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ పేరిట మోసాలకు  పాల్పడ్డాడు. 

Also raed: హీరో నాగ శౌర్య ఫార్మ్ హౌస్ లో పట్టుబడిన పేకాట బ్యాచ్

అంతేకాకుండా గుత్తా పవన్ కుమార్  ఫోన్‌లో పలువురు వీఐపీల ఫోన్‌ నెంబర్లను కూడా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన  పలువరు రాజకీయ నాయకులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఎన్జీవో పేరుతో విరాళాలు ఇస్తున్నట్టుగా, వీఐపీల‌తో పరిచయాలు ఉన్నట్టుగా ఫొటోలు దిగి మోసాలకు పాల్పడేవాడనని  ఎస్‌వోటీ  పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. సుమన్ కుమార్ అక్రమాలపై ఎస్‌వోటీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ