మంచిర్యాల జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు..

By team teluguFirst Published Nov 1, 2021, 11:15 AM IST
Highlights

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 4.3 గా గుర్తించారు. 

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 4.3 గా గుర్తించారు. వరుస భూ ప్రకంపనలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని ప్రజలు  చెబుతున్నారు. వరుసగా ఇలాంటి  ప్రకంపనలు చోటుచేసుకోవడంతోొ జిల్లా  ప్రజలు ఆందోళనలో ఉన్నారు.

మంచిర్యాల జిల్లాలో కూడా ఆదివారం సాయంత్రం భూమి కంపించింది. ఒక్కసారి ప్రకంపనలు చోటుచేసుకోవడంతో  ప్రజలు  భయాందోళనలతో ఇళ్ల  నుంచి  బయటకు పరుగులు తీశారు. జిల్లాలో భూ ప్రకంపనలు  చోటుచేసుకోవడం స్థానికులను  ఆందోళనకు గురిచేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీ, ఐబీ ప్రాంతం, నెన్నెల మండలం చిత్తాపూర్, జంగాల్‌పేటలో, హాజీపూర్‌ మండలం నర్సింగాపూర్‌లో, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, మందమర్రి, దండేపల్లి, భీమారం మండలాల్లోనూ భూమి కంపించింది. అయితే మహారాష్ట్రలోని  గడ్చిరోలి కేంద్రంగా భూమి మూడు సెకన్ల పాటు కంపించినట్టుగా  సమాచారం. మంచిర్యాల  జిల్లా మహారాష్ట్రకు సరిహద్దు  కావడంతో  ఆ ప్రభావం ఇక్కడ కనిపించినట్టుగా  తెలుస్తోంది. 

Also read: మంచిర్యాల జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు..

పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి  జిల్లాలో  కూడా..
పెద్దపల్లి, జగిత్యాల, భూపాపల్లి జిల్లాల్లో కూడా ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో మూడు సెకన్ల  పాటు  భూమి కంపించింది. దీంతో పలుచోట్ల ప్రజలు  ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, అంతర్గాం, ముత్తారం మండలాల్లో భారీ శబ్దాలు రావడంతో ఇళ్లలోని వస్తువులు కదిలాయి. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్‌పల్లి, బీర్‌పూర్, రాయికల్, గొల్లపల్లి మండలాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరు గులు తీశారు.

click me!