కామారెడ్డి జిల్లా బూర్గుల్ గ్రామంలో ఉద్రిక్తత: పోలీసుల కాళ్లు పట్టుకొన్న మాజీ ఎమ్మెల్యే అరుణ తార

By narsimha lode  |  First Published Jul 22, 2022, 12:26 PM IST


కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్  మండలంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. బూర్గులపల్లిలో బీజేపీ నేతలను వెళ్లకుండా అడ్డుకున్నారు. తమను బూర్గులపల్లికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అరుణ తార పోలీసుల కాళ్లు పట్టుకున్నారు.


నిజామాబాద్: Kama Reddy జిల్లాలోని Nizamsagar మండలంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. మండలంలోని Burgulలో బీజేపీ నేతలను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. బూర్గులపల్లి గ్రామానికి వెళ్లడానికి తమకు అనుమతివ్వాలని పోలీసుల కాళ్లు పట్టుకొంది మాజీ ఎమ్మెల్యే అరుణతార. అంతేకాదు తమను గ్రామంలోకి వెళ్లడానికి అనుమతివ్వాలని కూడా ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

బూర్గులపల్లి గ్రామంంలో BJP  నిర్మించిన జెండా దిమ్మెను కొందరు వ్యక్తులు గురువారం నాడు ధ్వంసం చేశారు. టీఆర్ఎస్ క్యాడరే ఈ జెండా దిమ్మెను ద్వంసం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.ఈ విషయమై రెండుపార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.

Latest Videos

undefined

బీజేపీ జెండా గద్దెను పునర్నిర్మించి ఇవాళ జెండాను ఆవిష్కరిస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. బూర్గుల్ గ్రామానికి రావాలని బీజేపీ పిలపునిచ్చింది. దీంతో ఇవాళ బూర్గుల్ గ్రామానికి వెళ్తున్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మరో నేత వెంకట్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు బూర్గుల్ గ్రామంలోకి ఎవరూ కూడా రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.  

అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయడంతో పాటు తమకు గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దాదాపుగా రెండు గంటలకు పైగా రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సమయంలో ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే అరుణతారను పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు.ఆ సమయంలో పోలీసుల కాళ్లు మొక్కి గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆమె వేడుకున్నారు. 

ఇవాళ ఉదయం నుండి గ్రామంలోకి వెళ్లి జెండాను ఆవిష్కరించాలని బీజేపీ నేతలు పట్టుదలగా ఉన్నారు. అయితే బీజేపీ నేతలను పోలీసులు గ్రామం బయటే నిలువరించడంతో పోలీసుల కళ్లుగప్పి గ్రామానికి వెళ్లిన కొందరు బీజేపీ నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. 

తెలంగాణలో కొంత కాలంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. అంతేకాదు కొన్ని గ్రామాల్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. రాష్ట్రంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.ఈ  మేరక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తుంది. బైక్ ర్యాలీల్లో బీజేపీ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ఈ బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు గాను బీజేపీ ఎంపీలకు పార్టీ నాయకత్వం అనుమతిని ఇచ్చింది.  ఈ కార్యక్రమంలోనే భాగంగా బూర్గుల్ గ్రామంలో బీజేపీ నేతలు జెండాను దిమ్మెను ఏర్పాటు చేసుకొన్నారు. అయితే ఈ జెండా దిమ్మెను  ధ్వంసం చేయడంతో నిన్నటి నుండి ఉద్రిక్తత నెలకొంది. 

ALSO READ:డబుల్ ఇంజన్ అంటే మోడీ, ఈడీ అని అర్ధమైంది: బండి సంజయ్ కి కేటీఆర్ కౌంటర్

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గాను బీజేపీ అగ్రనాయకత్వం కూడా రాష్ట్రంలో నేతలకు దిశా నిర్ధేశం చేస్తుంది. ఈ క్రమంలోనే హైద్రాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించారు.రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపును పురస్కరించుకొని పేరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభను నిర్వహించారు.ఈ సభ విజయవంతం కావడంతో  ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

 

click me!